Lion Dog Video: ఓడిపోతామని తెలిసినా సరే.. జీవితంలో ఈ మాత్రం నమ్మకం ఉంటే చాలు.. వైరల్‌గా మారిన వీడియో..
Lion And Dog Video Viral: జీవితంలో అన్నింటికంటే ముందుగా కావాల్సింది ధైర్యం. ఇదొక్కటి ఉంటే చాలు ఏదైనా సాధింవచ్చని చెబుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో...
Lion And Dog Video Viral: జీవితంలో అన్నింటికంటే ముందుగా కావాల్సింది ధైర్యం. ఇదొక్కటి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని చెబుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కోబోయే సమస్య చాలా పెద్దదై ఉంటుంది. మనం కచ్చితంగా ఓడిపోతామనే విషయం తెలుస్తుంది. కానీ ఇలాంటి సమయంలోనూ ఓ చిన్న సాహసం చేస్తే విజయాన్ని వరించకపోవచ్చక పోయినప్పటికీ కనీసం అప్పటికప్పుడు ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇప్పుడీదంతా ఎందుకనేగా మీ సందేహం. ఇక్కడ ఉన్న ఓ శునకాన్ని చూస్తుంటే మనం పైన చెప్పుకున్న మాటలు అక్షరాల సత్యం అనిపించకమానవు. వివరాల్లోకి వెళితే.. అదో వైల్డ్ లైఫ్ సఫారీ అక్కడ ఒక సింహం ఉంది. ఎలా వెళ్లిందో.. ఎందుకు వెళ్లిందో తెలియదు కానీ ఓ గ్రామ సింహం అదేనండి కుక్క ఆ సింహం కంట్లో పడింది. సింహం ఊరుకుంటుందా.. కుక్కపైకి దాడికి దిగింది. అయితే ఏ మాత్రం భయపడని ఆ శుకనం ఏకంగా సింహంపై ప్రతిదాడికి దిగింది. దీంతో ఒకానొక సమయంలో సింహం వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది. ఇక ఎక్కువ సేపు ఇలాగే కొనసాగితే మొదటికే మోసం వస్తుందని భావించిన ఆ శునకం పోరాటం ముగించుకొని వెను తిరిగింది. ఒకవేళ శునకం ముందుగానే ప్రతి ఘటన చూపకపోతే మొదట్లోనే సింహం చేతులో ‘కుక్క’ చావు చచ్చేది. ధైర్యం చేసింది కాబట్టే బతికి బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 1:34 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను పర్వీన్ కశ్వాన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు.. ‘జీవితంలో ఈ మాత్రం నమ్మకం ఉంటే చాలు. సింహంతో కుక్క పోరాటం. వీధి కుక్కలు, క్రూర మృగాల పోరాటాలలో ఇదే హైలెట్ సంఘటన’ అంటూ కామెంట్ చేశాడు.
Need this much confidence in life. Dog vs Lion. It also highlights issue of stray dogs & wildlife interaction. @zubinashara pic.twitter.com/lNu7X4ALm5
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 10, 2021
Also Read: Elephant attack : జనావాసంలోకి గజరాజులు.. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.. భయం గుపిట్లో ప్రజలు