AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటెన్షన్‌-బిహేవియర్‌ గ్యాప్‌ కారణంగానే కరోనా అంటే భయం పోయిందా?

ఇంటెన్షన్‌-బిహేవియర్‌ గ్యాప్‌ అంటే ఏమిటో తెలుసా? ప్రజల ఉద్దేశాలకు, ప్రవర్తనకు మధ్య తేడా ఉండటం! ఈ కారణంగానే కరోనా వైరస్‌ను జనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారట! కరోనా రెండో దశ వ్యాప్తి భయంకరంగా ఉన్నా ప్రజలు..

ఇంటెన్షన్‌-బిహేవియర్‌ గ్యాప్‌ కారణంగానే కరోనా అంటే భయం పోయిందా?
Balu
|

Updated on: Nov 24, 2020 | 5:47 PM

Share

ఇంటెన్షన్‌-బిహేవియర్‌ గ్యాప్‌ అంటే ఏమిటో తెలుసా? ప్రజల ఉద్దేశాలకు, ప్రవర్తనకు మధ్య తేడా ఉండటం! ఈ కారణంగానే కరోనా వైరస్‌ను జనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారట! కరోనా రెండో దశ వ్యాప్తి భయంకరంగా ఉన్నా ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.. యూరప్‌ దేశాలలో వైరస్‌ వ్యాప్తి జోరుగా సాగుతోంది.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు.. పార్టీలు జరుగుతూనే ఉన్నాయి.. జనం గుంపులు గుంపులుగా తిరుగుతూనే ఉన్నారు. పార్కులు, పబ్బులు కిటకిటలాడుతున్నాయి. కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు.. దీనికంతటికి కారణం ఇంటెన్షన్-బిహేవియర్‌ గ్యాపే కారణం. హెచ్చరికలను జనం వినిపించుకోవడం లేదని ఊరికే ఉండటానికి వీల్లేదని, పదేపదే చెబుతూనే ఉండాలని నిపుణులు అంటున్నారు. అప్పుడే ప్రజల ప్రవర్తనలో మార్పు వస్తుందని చెబుతున్నారు. కరోనా నియంత్రణలో వియత్నాం ప్రభుత్వం సక్సెసయ్యిందంటే అందుకు కారణంగా అన్ని మాధ్యమాలను చక్కగా ఉపయోగించుకుని విస్తృతంగా ప్రచారం చేయడమేనని వివరిస్తున్నారు. ప్రజలలో అవగాహన కల్పించడంలో వియత్నాం ప్రభుత్వం విజయవంతమయ్యిందని చెబుతున్నారు. అలాగే ప్రచారానికి వాడుకున్న ఓ పాప్‌సాంగ్‌ కూడా జనాలకు బాగా చేరువయ్యిందని నిపుణులు అంటున్నారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థలను బాగా వాడుకున్న జర్మనీ, న్యూజిలాండ్‌ దేశాలు కరోనాను బాగా నియంత్రించగలిగాయని పీఆర్‌ ప్రొఫెషనల్స్‌ సర్వేలో వెల్లడయ్యింది. ప్రజల మైండ్‌సెట్‌ మారడానికి కమ్యూనికేషన్ ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన సూచనను జర్మనీ, న్యూజిలాండ్‌ దేశాలు పాటించాయి.