AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గౌహతి-ఐఐటీ పరిశోధకుల మరో ఘనత.. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ డేటా ట్రాన్స్ ఫర్.. సిగ్నల్‌ సామర్థ్యం తగ్గకుండా సమాచార మార్పిడి..!

టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత ఐఐటీ విద్యార్థులు మరో ఘనత సాధించారు. డాటా సమాచారాన్ని నేరుగా పంపించేందుకు గౌహతి-ఐఐటీ పరిశోధనలు ఫలించాయి. డేటా సరఫరా సామర్థ్యం తగ్గకుండా చూడవచ్చని నిరూపించారు.

గౌహతి-ఐఐటీ పరిశోధకుల మరో ఘనత.. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ డేటా ట్రాన్స్ ఫర్.. సిగ్నల్‌ సామర్థ్యం తగ్గకుండా సమాచార మార్పిడి..!
Balaraju Goud
|

Updated on: Nov 24, 2020 | 5:37 PM

Share

టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత ఐఐటీ విద్యార్థులు మరో ఘనత సాధించారు. డాటా సమాచారాన్ని నేరుగా పంపించేందుకు గౌహతి-ఐఐటీ పరిశోధనలు ఫలించాయి. డేటా సరఫరా సామర్థ్యం తగ్గకుండా చూడవచ్చని నిరూపించారు. ఇంటర్నెట్‌ ద్వారా ‘ధ్వని, టెక్ట్స్‌, చిత్రాలు’ వంటి డేటాను పంపించడానికి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ను ఉపయోగిస్తుంటారు. అదే సెల్‌ఫోన్ల ద్వారా అయితే కొంతవరకు వైర్‌లెస్‌ విధానాన్ని అనుసరిస్తుంటారు. కొన్ని రకాల కాంతి కిరణాలు, లేజర్‌ కిరణాల ద్వారా వైర్‌లెస్‌ పద్ధతిలో సమాచారం పంపిస్తుంటారు. దీన్నే వోర్టెక్స్‌ బీమ్‌ విధానమని వ్యవహరిస్తుంటారు.

అయితే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ పద్ధతిలో డేటాను పంపించడం సమస్యగా మారుతోంది. దీన్ని అధిగమించడంపై గౌహతి-ఐఐటీ అధ్యయన బృందం పరిశోధనలు జరిపి విజయం సాధించింది. కాంతి కిరణాలను లంబకోణంలో పంపించడం ద్వారా ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా డేటాను ట్రాన్స్ ఫర్ చేయవచ్చని నిరూపించారు. ఇందుకోసం ఆర్థోగోనల్‌ స్పేసియల్‌ మోడ్స్‌ను వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. దీన్నే జెర్నైక్‌ మోడ్స్‌ అని కూడా అంటారు. వీటి ద్వారా ప్రారంభం నుంచి ముగింపు వరకు సిగ్నల్‌ సామర్థ్యం ఒకేలా ఉంటుందని అధ్యయన టీమ్ తెలిపింది. అంతేకాదు ఎలాంటి అడ్డంగులు వచ్చినా వాటిని అధిగమిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్‌ వసంత రంజన్‌ బారువా చెప్పారు.

తీవ్రమైన గాలులు వచ్చిన సమయంలో ప్రయోగాత్మకంగా కిలోమీటరు దూరం మేర సమాచారం పంపించినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని తమ పరిశోధనలో తేలిందని ఆయన వివరించారు. అలాగే, సమాచారం అందుకొనే వ్యక్తికి లబ్ధి కలిగేలా దీన్ని రూపొందించినట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న అభ్యపురి కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శంతను కొన్వార్‌ చెప్పారు. సమాచారం కేవలం అందుకోవాల్సిన వారికే చేరుతుందని, అందువల్ల సురక్షితంగా ఉంటుందని శంతన కొన్వార్ వివరించారు. రానున్న రోజుల్లో కమ్యూనికేషన్‌ రంగంలో ఈ విధానం కీలక పాత్ర పోషించనుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్