దాదా ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం
రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రణబ్ ముఖర్జీని పార్టీ సామాజిక వర్గాల్లో బాగా గౌరవించారు. అతను 1978 జనవరి 27 న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యునిగా పనిచేశారు. పార్టీలో పలు కీలక పదవులు అనుభవించారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి వివిధ శాఖల మంత్రిగానూ ప్రణబ్ సేవలందించారు. అనంతరం భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం ఆగస్ట్ 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స తరువాత ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ప్రణబ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.
With a Heavy Heart , this is to inform you that my father Shri #PranabMukherjee has just passed away inspite of the best efforts of Doctors of RR Hospital & prayers ,duas & prarthanas from people throughout India ! I thank all of You ?
— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020
ప్రణబ్ తండ్రి పేరు కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మీ. ప్రణబ్ ముఖర్జీ… కలకత్తా యూనివర్సిటీ నుంచి హిస్టరీలో పీజీ పూర్తి చేశారు. లా కూడా చదివారు. టీచర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రణబ్. ప్రణబ్. ఆ తర్వాత దేశేర్ దక్ అనే ఓ బెంగాలీ పత్రికలో జర్నలిస్టుగా చేరారు.1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ లోని బిర్బుమ్ జిల్లా మిరాటీలో ఆయన జన్మించారు.
అక్కడి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రగా, వాణిజ్య శాఖ మంత్రిగానూ ప్రణబ్ సేవలందించారు. భిన్నమైన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించిన నేతగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయన పార్టీ సంక్షోభ సమయంలో అన్ని విధాలుగా ఆదుకున్నారు.
భారత మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో ఐదు దశాబ్దాల పాటు కొనసాగారు. పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా ఎదిగిన ఆయన ఇందిరా నుంచి మొదలుకుంటే సోనియా వరకు దాదా నమ్మిన బంటుగా మారారు. రాజ్యసభకు ఐదుసార్లు, లోక్‌సభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. కానీ దాదా చిరకాల వాంఛ మాత్రం తీరలేదు. అదే ప్రధాని కావాలనుకున్న కోరిక.
ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన దాదాకు ప్రధాని పదవి రెండుసార్లు అందినట్టే అంది చేజారింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం నిబంధనల ప్రకారం.. పార్టీలోని సీనియర్ నేత ప్రధాని పదవిని చేపట్టాల్సి ఉంది. ఇదే రాజీవ్‌గాంధీ, దాదా మధ్య మనస్పర్ధలకు కారణమైంది. రాజీవ్ దుర్మరణంతో పీవీ నర్సింహరావు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ప్రధాని అయ్యారు. ఇక యూపీఏ-2 హయాంలో రాహుల్ గాంధీ పార్టీలో క్రియాశీలకంగా మారడం దాదాకు నచ్చలేదు. ఈ క్రమంలో దాదాకు సోనియా రాష్ర్టపతి పదవి కట్టబెట్టి.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేశారు. ఆ తర్వాత ప్రణబ్ శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయ్యారు.
అంతే కాదు.. 1982 లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి… అత్యంత పిన్న వయసులో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. మంత్రిగా ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు దేశ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. తర్వాత 1987లో ప్రణబ్ సొంత పార్టీని స్థాపించారు. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పేరుతో పార్టీని స్థాపించి… 1989లో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మళ్లీ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం 2017 జూలై 25 న ముగిసింది.
2012 నుంచి 2017 వరకు ప్రణబ్ 13వ భారత రాష్ట్రపతిగా సేవలందించారు. రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి ఓట్లను పొంది ప్రత్యర్థి పి.ఎ.సంగ్మాను ఓడించాడు. దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఆయనను వరించింది. ఇప్పటికే భారత రత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్రప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ చేరారు.ప్రణబ్ ముఖర్జీని 2008లోనే పద్మ విభూషణ్ అవార్డు వరించింది. 2010లో బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ఏషియా అవార్డును అందుకున్నారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రణబ్ ముఖర్జీ రాజకీయ వేత్త మాత్రమే కాదు.. ఆయనలో మంచి రచయిత ఉన్నాడు. ఆయన పలు పుస్తకాలను రాశారు. 1987లో ఆఫ్ ది ట్రాక్ అనే పుస్తకాన్ని రాశారు. 1992లో సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్, చాలెంజెస్ బిఫోర్ ది నేషన్ అనే పుస్తకాలను రచించారు. 2014లో ది డ్రమాటిక్ డెకేడ్ : ది డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్ అనే పుస్తకాన్ని రచించారు.




