జియో ఫైబర్ మరో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్‌తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది.  ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది...

  • Sanjay Kasula
  • Publish Date - 6:28 pm, Mon, 31 August 20
జియో ఫైబర్ మరో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్‌తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది.  ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి జియోఫైబర్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక నెల రోజులుపాటు ఎలాంటి కండీషన్లు లేని 30 రోజుల ఉచిత ట్రయల్ తీసుకొచ్చింది. వీరితోపాటు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియోఫైబర్ పాత కస్టమర్లకు కూడా 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది.

అలాగే 999, 1499 ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల చందా ఉచితం అని తెలిపింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ… వంటి ఉన్నాయి. 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుపరిచారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ప్లాన్‌ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతారు. విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమైన ప్రస్తుత సమయంలో వీటిని తీసుకొచ్చామని జియో ఫైబర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.