జిమ్ ట్రైన‌ర్‌కు రేంజ్ రోవ‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చిన డార్లింగ్

ప్ర‌భాస్ అంటే స‌మ్‌థింగ్ స్పెష‌ల్. ఇండ‌స్ట్రీలో అంద‌రికీ డార్లింగ్ అత‌డు. ఇండ‌స్ట్రీలోనే కాదు బ‌య‌ట కూడా.

జిమ్ ట్రైన‌ర్‌కు రేంజ్ రోవ‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చిన డార్లింగ్
Ram Naramaneni

|

Sep 05, 2020 | 4:51 PM

ప్ర‌భాస్ అంటే స‌మ్‌థింగ్ స్పెష‌ల్. ఇండ‌స్ట్రీలో అంద‌రికీ డార్లింగ్ అత‌డు. ఇండ‌స్ట్రీలోనే కాదు బ‌య‌ట కూడా. ప్ర‌భాస్ స్టైల్, న‌ట‌న‌తో పాటు క‌ల్మ‌షం లేని అత‌ని మ‌న‌సుకు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. చాలా సింపుల్‌గా ఉంటాడు ప్ర‌భాస్. హడావిడి అస‌లు ఉండ‌దు. నెగ‌టివ్ కామెంట్స్ జోలికే వెళ్ల‌డు. త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఎంత పెద్ద హిట్టు వ‌చ్చినా గ‌ర్వాన్ని త‌ల‌కెక్కించుకోడు. దారుణ ఫ్లాప్ వచ్చినా పెద్ద‌గా ప‌ట్టించుకోడు. ఇక‌ ప్రభాస్‌కి కొన్ని మంచి అల‌వాట్లు ఉన్నాయ్. త‌న మిత్రుల‌కు, స‌న్నిహితుల‌కు, అతిథుల‌కు క‌డుపునిండా అన్నం పెట్ట‌డం…కాస్ట్లీ గిఫ్టులు ఇవ్వ‌డం. తాజాగా త‌న‌ను బాహుబ‌లిలా తీర్చిదిద్దిన జిమ్ ట్రైన‌ర్ ల‌క్ష్మ‌ణ్ రెడ్డికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి అంద‌ర్నీ షాక్‌కు గురిచేశాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఏకంగా రేంజ్ రోవ‌ర్ కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు. కాగా త‌న చుట్టూ ఉన్న‌వారికి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వ‌డం ప్ర‌భాస్‌కు కొత్తేం కాదు. అందుకే ప్ర‌భాస్‌ను అంద‌రూ ఫ్యూర్ హార్ట్ ప‌ర్స‌న్ అని కొని‌యాడుతుంటారు.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

ప్రాణం తీసిన స్కూటీ స్టాండ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu