ప్రాణం తీసిన స్కూటీ స్టాండ్

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూటీ స్టాండ్ విష‌యంలో నిర్ల‌క్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది.

ప్రాణం తీసిన స్కూటీ స్టాండ్
Follow us

|

Updated on: Sep 05, 2020 | 3:55 PM

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూటీ స్టాండ్ విష‌యంలో నిర్ల‌క్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..శుక్రవారం రోజున భీమవరానికి చెందిన దుర్గారావు పాలకొల్లు వైపు నుంచి స్కూటీపై వెళుతున్నాడు. పాలకోడేరు మండలం పెన్నాడలోని రావిచెట్టు సెంటర్ ద‌గ్గ‌రికి వచ్చే సరికి స్కూటర్‌కు యాక్సిడెంట్ జరిగింది. స్కూటీ స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు బ‌లంగా తగిలి కింద పడిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలు అవ్వ‌డంతో భీమవరం నుంచి 108 వాహనం వచ్చేలోపే అతడు ప్రాణాలు విడిచాడు.

కొద్దిసేపటి తర్వాత 108 సిబ్బంది వచ్చి అత‌డు చనిపోయాడని నిర్ధారించారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తలకు తీవ్రమైన గాయం అవ్వ‌డం వ‌ల్లే అత‌డు మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. బైక్‌లపై వెళ్లే సమయంలో స్టాండ్ తీయ‌డం ఎంత ముఖ్య‌మో తెలియ‌క‌పోతే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ద‌య‌చేసి జాగ్ర‌త్త వ‌హించండి. ఇంటి వ‌ద్ద మీ కోసం కుటుంబ స‌భ్యులు ఎదురుచూస్తూ ఉంటారు.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే