టీడీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత గుడ్‌బై…!

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆమె సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన ఆమె.. ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఈ మంగళవారం వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా మండలిలో సునీత ఓటేశారు. దీంతో విప్‌కు వ్యతిరేకంగా ఓటేసిన సునీతపై చర్యలకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:34 pm, Wed, 22 January 20
టీడీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత గుడ్‌బై...!

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆమె సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన ఆమె.. ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఈ మంగళవారం వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా మండలిలో సునీత ఓటేశారు. దీంతో విప్‌కు వ్యతిరేకంగా ఓటేసిన సునీతపై చర్యలకు టీడీపీ సిద్దమైంది. మరోవైపు సునీత భర్త పోతుల సురేశ్.. దివంగత పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. అంతేకాదు ఆయన అప్పట్లో మావోయిస్టు కీలక నేతగా కూడా చక్రం తిప్పారు.