టికెట్‌ లేని ప్రయాణికుల ద్వారా.. రూ.100 కోట్ల ఆదాయం!

చట్ట ప్రకారం టికెట్టు లేని ప్రయాణం నేరం. కాగా.. టికెట్ లేని ప్రయాణికుల ద్వారా.. వెస్ట్రన్ రైల్వే 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 104.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ కాలంలో టికెట్ లేకుండా ప్రయాణించిన 21.33 లక్షల కేసులు గుర్తించినట్టు వెస్ట్రన్ రైల్వే తెలిపింది. ఇది గత ఏడాది కంటే 8.85% ఎక్కువ. వీటిలో లగేజీకి సంబంధించిన జరిమానాలు కూడా ఉన్నాయి. డిసెంబరులోనే 2.13 లక్షల కేసులు నమోదయ్యాయని.. రూ.10.14 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. […]

టికెట్‌ లేని ప్రయాణికుల ద్వారా.. రూ.100 కోట్ల ఆదాయం!
Follow us

| Edited By:

Updated on: Jan 22, 2020 | 3:57 PM

చట్ట ప్రకారం టికెట్టు లేని ప్రయాణం నేరం. కాగా.. టికెట్ లేని ప్రయాణికుల ద్వారా.. వెస్ట్రన్ రైల్వే 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 104.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ కాలంలో టికెట్ లేకుండా ప్రయాణించిన 21.33 లక్షల కేసులు గుర్తించినట్టు వెస్ట్రన్ రైల్వే తెలిపింది. ఇది గత ఏడాది కంటే 8.85% ఎక్కువ. వీటిలో లగేజీకి సంబంధించిన జరిమానాలు కూడా ఉన్నాయి. డిసెంబరులోనే 2.13 లక్షల కేసులు నమోదయ్యాయని.. రూ.10.14 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు.

మొత్తం 2,124 చోట్ల జరిగిన తనిఖీల్లో 1,821 మందిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. 2019 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మొత్తం 2,124 సోదాలు నిర్వహించినట్లు డబ్ల్యుఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రవీందర్ భాకర్ తెలిపారు. రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 1,821 మందిని అరెస్టు చేసి, విచారించి, జరిమానా విధించామని, ఈ క్రమంలో 1,632 మంది బిచ్చగాళ్లను రైల్వే ప్రాంగణం నుంచి సురక్షిణి బృందం తొలగించినట్లు ఆయన తెలిపారు.