కరోనాను అధిగమిస్తే భారత్‌కు ఉజ్వల భవిత.. బీజేపీ వైట్ పేపర్
కరోనాను నియంత్రించే దిశగా తీసుకుంటున్న చర్యలలో యావత్ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలందుకుంటున్న భారత్‌కు.. కరోనాను సక్సెస్‌ఫుల్ అధిగమించగలిగితే ఉజ్వల భవిత వుందని అంఛనా వేస్తోంది దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవంప చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది అధికార బీజేపీ.

కరోనాను నియంత్రించే దిశగా తీసుకుంటున్న చర్యలలో యావత్ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలందుకుంటున్న భారత్‌కు.. కరోనాను సక్సెస్‌ఫుల్ అధిగమించగలిగితే ఉజ్వల భవిత వుందని అంఛనా వేస్తోంది దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవంప చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది అధికార బీజేపీ. పలువురు ఆర్థిక రంగ నిఫుణులు, పారిశ్రామిక వేత్తలు, డిజిటల్ రంగ ప్రతినిధులు, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో విస్తృత సంప్రదింపుల అనంతరం నివేదిక రూపొందించిన బీజేపీ.. దానిని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌లకు అందించింది.
దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి బీజేపీ కీలక సూచనలను పార్టీ నివేదికలో పేర్కొంది. దీర్ఘకాలిక ప్రణాళికతో తయారీ రంగ నూతన విధానాన్ని రూపొందించాలని నివేదికలో సూచించింది బీజేపీ. కొత్త విధానంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా విధానాలను రూపొందించాలని, కార్మిక చట్టాలను సవరిస్తూ సులభతరమైన విధానాలను అమల్లోకి తేవాలని వివరించింది. కోవిడ్-19 అనంతర పరిస్థితుల్లో భారతదేశానికి విస్తృత అవకాశాలుంటాయని బీజేపీ అంఛనా వేసింది.
దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చుకోడానికి ఇదే సరైన సమయమని, అనుమతుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండొద్దని, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని బీజేపీ తన నివేదికలో సూచించింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ్ వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ప్రత్యేకంగా ఓ నివేదికను మోదీ ప్రభుత్వానికి అంద జేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు అడ్డంకి కాకూడదని, సరిహద్దులు దాటి అమ్ముకునే స్వేచ్ఛ రైతాంగానికి కల్పించాలని సూచించింది.




