BJP Donations: కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..
2018 ఎన్నికల ముందు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీకి భారీగా విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఆ పార్టీకి సుమారు రూ.742 కోట్లు రాగా.. కాంగ్రెస్‌కు రూ.148 కోట్లు విరాళాలు సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Political Party Donations: 2018 ఎన్నికల ముందు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీకి భారీగా విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఆ పార్టీకి సుమారు రూ.742 కోట్లు రాగా.. కాంగ్రెస్‌కు రూ.148 కోట్లు విరాళాలు సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2017-18లో రూ.437 కోట్లు విరాళాలు వస్తే.. 2018-19లో అది కాస్తా 70 శాతానికి పెరిగినట్లు నివేదిక చెబుతోంది. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే 2017-18లో ఆ పార్టీకి కేవలం రూ.26 కోట్లు మాత్రమే రాగా.. 2018-19కి మాత్రం రూ.148 కోట్లు వచ్చాయి.
ఇక బీజేపీకి వచ్చిన భారీ విరాళాలు 5 జాతీయ పార్టీలకు వచ్చిన డొనేషన్స్ మొత్తం కంటే 3 రేట్లు ఎక్కువ అని సంస్థ తెలిపింది. అయితే డోనేషన్లలో ఎక్కువ శాతం నిధులు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చాయట. అటు బీఎస్పీ తమకు 2018-19లో రూ.20,000లకు మించి విరాళాలు రాలేదని స్పష్టం చేసింది. తమకు గత 13 ఏళ్లుగా ఇంత మొత్తం మేరకు మాత్రమే విరాళాలు అందుతున్నట్లు ఆ పార్టీ తెలిపింది. కాగా, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు ప్రోగ్రెస్సివ్ ఎలెక్టోరల్ ట్రస్ట్ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ శాతం విరాళాలు ఇస్తున్నట్లు నివేదికలో తేలింది.
For More News:
ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..
విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…
అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. ఎందుకంటే..
మరోసారి కోహ్లీసేన ఫ్లాప్ షో.. వైట్‌వాష్ తప్పదా.?
వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే ‘దీప’ వెండితెర ఎంట్రీ.!