Maharastra Government: విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

మహారాష్ట్రలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మరింత చేరువవుతోంది. తాజాగా విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు మహా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

Maharastra Government: విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్...
Follow us

|

Updated on: Feb 29, 2020 | 2:29 PM

Maharastra Government: మహారాష్ట్రలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మరింత చేరువవుతోంది. ఇక తాజాగా అదే కోవలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు మహా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ ముందుకు తీసుకువస్తామని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రి నవాబ్ మాలిక్ మీడియాకు తెలిపారు. ముస్లింలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. దీనిపై న్యాయపరమైన సలహాలు కూడా తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం కూడా ఇదే తరహా ఆలోచన చేసిందని.. అయితే న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, లండన్‌లో అమలవుతున్న నైట్ లైఫ్ విధానానికి అనుగుణంగా ఇటీవల ముంబైలో 24 గంటలూ అన్ని మాల్స్, మల్టీప్లెక్సులు, హోటళ్లను తెరిచి ఉంచేందుకు మహా కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య థాక్రే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

For More News: 

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. ఎందుకంటే..

కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…