ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై పోలీసు ఆత్మహత్య
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన యువకులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగింది.
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన యువకులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగింది. అయితే తాజాగా తమిళనాడులో ఓ పోలీసే ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కి బానిసై, లక్షలలో డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ధర్మపురి జిల్లాకి చెందిన వెంకటేసన్ , సేలం జిల్లాలోని ప్రత్యేక పోలీస్ బెట్టాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా గంటల తరబడి ఆన్లైన్ రమ్మీ ఆడుతూ లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో అన్ని సమస్యలు అతడ్ని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తీవ్ర మానసిక వేధనకు గురై గవర్నమెంట్ హాస్టల్ లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read :
Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?