AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“వందేభారత్‌” ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ- వారణాసిల మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత హైస్పీడ్ ట్రైన్ ను శుక్రవారం ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ కు వందేభారత్ గా నామకరణం చేశారు. ఈ రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో మాట్లాడారు. ఈ రైలులో మొత్తం 16ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ […]

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 6:20 PM

Share

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ- వారణాసిల మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత హైస్పీడ్ ట్రైన్ ను శుక్రవారం ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ కు వందేభారత్ గా నామకరణం చేశారు. ఈ రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో మాట్లాడారు. ఈ రైలులో మొత్తం 16ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా రాకపోకలు సాగించే ఈ రైలులో 1128మంది కూర్చొనేలా సీట్లున్నాయి. ఢిల్లీ – వారణాసి మధ్య మొత్తం 753 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 9గంటల 40నిమిషాల్లో పూర్తిచేయనుంది. మధ్యలో రెండు స్టేషన్లలో 40నిమిషాలపాటు ఆగనుంది. ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ తో అనుసంధానించిన ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్,వైఫై ఎంటర్ టైన్మెంట్ సౌకర్యాలున్నాయి. కాగా వందేభారత్ ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తోపాటు మరికొందరు మంత్రులు రైలులో కొద్దిదూరం ప్రయాణించారు. ఈ నెల 17వ తేదీ నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!