ముగిసిన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. కరోనా టీకా పరీక్షల పురోగతిపై భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు
మూడో దశ క్లనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో...

ప్రధాని మోదీ వ్యాక్సిన్ టూర్ కొనసాగుతోంది. ఉదయం అహ్మదాబాద్‌లోని మోదీ జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్ ధరించి వ్యాక్సిన్ ప్రయోశాలను పరిశీలించారు. అహ్మదాబాద్ నుంచి నేరుగా ప్రధాని హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని… రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్లారు. అనంతరం అక్కడ కోవాగ్జిన్ ప్రయోగాలను పరిశీలించారు.. వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలపై భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు.
LIVE NEWS & UPDATES
-
పూణె వెళ్లేందుకు టేకాఫ్ అయిన మోదీ ఫ్లైట్..
ఇవాళ (శనివారం) మధ్యాహ్నం12 గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ లోని హకీంపేట చేరుకున్నారు మోదీ. దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగిన ప్రధాని పర్యటన అంతా ప్రొటోకాల్ ప్రాకారం సాగింది. ప్రధానికి వీడ్కోలు పలికేందుకు తెలంగాణ నుంచి తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఐదుగురుకి మాత్రమే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రధానికి సెండాఫ్ ఇవ్వగా మోదీ ఫ్లైట్ టేకాఫ్ అయింది. హైదరాబాద్ పర్యటన ముగిసిన నేపథ్యంలో ప్రధాని పూణె చేరుకుని అక్కడి సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు.
-
ముగిసిన భారత ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఒక రోజు పర్యటనలో భాగంగా మోదీ హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరిగా భారత్ బయోటెక్ సందర్శించిన మోదీ, అక్కడి శాస్త్రవేత్తలతో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం నిర్వహించారు. కరోనా టీకా కోవాగ్జిన్ వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో మోదీ చర్చించారు. టీకా ప్రయోగశాలను సందర్శించారు. పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి పర్చడంలో ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించినందుకు మోదీ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం బయటకు వచ్చిన మోదీ అందరికీ అభివాదం చేస్తూ పూణె కు పయనమయ్యేందుకు కాన్వాయ్ లో హకీంపేటకు బయలుదేరారు. భారత్ బయోటెక్ నుంచి 20 నిమిషాల్లో మోదీ హకీంపేట చేరుకున్నారు.
At the Bharat Biotech facility in Hyderabad, was briefed about their indigenous COVID-19 vaccine. Congratulated the scientists for their progress in the trials so far. Their team is closely working with ICMR to facilitate speedy progress. pic.twitter.com/C6kkfKQlbl
— Narendra Modi (@narendramodi) November 28, 2020
-
-
మరికాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటనలో కరోనా టీకా అభివృద్ధిపై సమీక్ష
అహ్మదాబాద్ టు హైదరాబాద్…
భారత్ బయోటెక్‌కు.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని హకీంపేట వైమానికి స్థావరానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి నగర శివార్లలోని జినోమ్ వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ ‘కొవాగ్జిన్’ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది.
Visited Zydus Biotech Park in Ahmedabad to know more about the indigenous DNA based vaccine being developed by Zydus Cadila. I compliment the team behind this effort for their work. Govt of India is actively working with them to support them in this journey: PM Modi#COVID19 https://t.co/EyiJfxjMxN pic.twitter.com/5yEn2b31tH
— ANI (@ANI) November 28, 2020
-
హకీంపేటకు చేరుకున్న ప్రదాని మోదీ.. నేరుగా జినోమ్‌వ్యాలీకి..
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ సందర్శన అనంతరం హైదరబాద్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ …హకీంపేటకు చేరుకున్నారు.హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జినోమ్‌వ్యాలీకి వెళ్లనున్నారు ప్రధాని.
-
ముందంజలో భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ ప్రస్తుతం మూడోదశ క్లినికల్ ట్రయల్స్
కోవిడ్ టీకా ప్రయోగాలు చేస్తున్న భారత్ బయోటెక్
హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్ ప్రయోగాల్లో ముందంజలో ఉంది. కోవాగ్జిన్ ప్రస్తుతం మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యధిక మందిపై మొదటిసారిగా కోవిడ్ టీకా ప్రయోగాలు చేస్తున్న కంపెనీ భారత్ బయోటెక్.
-
-
శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్ష… కొవాగ్జిన్ పురోగతిపై ఆరా..శాస్త్రవేత్తలను అభినందించిన మోదీ
ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు
రెండు దశల్లో జరిగిన ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ప్రస్తుతం మూడోదశలో ప్రయోగాలు ఎలా సాగుతున్నాయి ? ఎప్పటిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది ? అనే విషయాలను శాస్త్రవేత్తలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
-
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ … రోడ్డు మార్గంలో భారత్ బయోటెక్‌కు.. కోవాగ్జిన్ ప్రొగ్రెస్‌పై రివ్యూ
భారత్ బయోటెక్‌లో కొనసాగుతున్న మోదీ విజిట్
భారత్ బయోటెక్‌లో శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. కోవాగ్జిన్ ప్రయోగాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రయోగంలో జరుగుతున్న పురోగతిని ప్రధాని మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో కోవాగ్జిన్ ఉందని తెలిపారు.
Prime Minister @narendramodi arrives at the Air Force Station at Hakimpet near #Hyderabad.
On his second leg of his 3-city visit, he arrived from Ahmedabad after visiting Zydus Cadila Pharmaceutical’s vaccine development facility this morning. pic.twitter.com/2MQ6Abbmth
— DD India (@DDIndialive) November 28, 2020
-
భారత్ బయోటెక్‌కు ప్రధాని మోదీ.. శాస్త్రవేత్తలతో సమీక్ష.. టీకా అభివృద్ధిపై ఆరా..
కొవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్ష
హకీంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి మోదీ రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీకి చేరుకున్నారు. అక్కడ కోవాగ్జిన్ ప్రయోగాలను పరిశీలిస్తున్నారు. అనంతరం భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నేరుగా పుణెకు చేరుకుంటారు. అక్కడ సిరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలిస్తారు.
Telangana: Prime Minister Narendra Modi arrives in Hyderabad, to visit Bharat Biotech facility to review COVID19 vaccine development pic.twitter.com/Vu6i7jsCIB
— ANI (@ANI) November 28, 2020
-
హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ..స్వాగతం పలికిన సీఎస్, డీజీపీ,
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అధికారులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీ, కలెక్టర్ స్వాగతం పలికారు. మరికాసేపట్లో జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సందర్శనకు ప్రధాని బయలుదేరి వెళ్లనున్నారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో జినోమ్ వ్యాలీకి వెళ్లనున్నారు. కొవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని చర్చించనున్నారు. ‘కొవాగ్జిన్’ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2:15 గంటలకు బయోటెక్ నుంచి హకీంపేటకు ప్రధాని మోదీ తిరుగు పయనంకానున్నారు.
-
ప్రధాని మోదీకి అధికారుల స్వాగతం.. హకీంపేట్ నుంచి నేరుగా భారత్ బయోటెక్ చేరుకున్నారు
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్
ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.25 గం.కు భారత్ బయోటెక్‌కు చేరుకోనున్నారు. అక్కడే 2.10 గంటల వరకు భారత్ బయోటెక్ సందర్శిస్తారు. అనంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడి.. కొవాగ్జిన్ పురోగతిని తెలుసుకోంటారు.
మ.2.15 గం.కు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం అవుతారు. మధ్యాహ్నం 2.40 గం.కు హకీంపేట విమానాశ్రయం చేరుకోని..మధ్యాహ్నం 3.50 గం.కు హకీంపేట నుంచి పుణె బయలుదేరుతారు.
-
హకీంపేటకు చేరుకున్న ప్రదాని మోదీ.. నేరుగా జినోమ్‌వ్యాలీకి..
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ సందర్శన అనంతరం హైదరబాద్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ …హకీంపేటకు చేరుకున్నారు.హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జినోమ్‌వ్యాలీకి వెళ్లనున్నారు ప్రధాని.
Published On - Nov 28,2020 3:31 PM