ఐపీఎల్ ప్రదర్శనపై మీమ్స్.. షేర్ చేసిన జిమ్మీ నీషమ్.. క్షమాపణలు చెప్పానంటూ మాక్స్‌వెల్ రెస్పాండ్..

ఈ రెండు జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు క్రికెట్ల ఆటతీరు ఇప్పుడు విమర్శలపాలైంది. ఒకరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ కాగా, మరొకరు న్యూజీలాండ్ ప్లేయర్ జిమ్మీ నీషమ్.

ఐపీఎల్ ప్రదర్శనపై మీమ్స్.. షేర్ చేసిన జిమ్మీ నీషమ్.. క్షమాపణలు చెప్పానంటూ మాక్స్‌వెల్ రెస్పాండ్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 28, 2020 | 3:41 PM

అంతర్జాతీయ స్థాయిలో శుక్రవారం నాడు నాలుగు దేశాల జట్ల మధ్య క్రికెట్ పోరు జరిగింది. ఒకటి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగగా, రెండోది న్యూజీలాండ్-వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ రెండు మ్చాచ్‌ల్లో ఆసిస్, న్యూజీలాండ్ దేశాలు విజయం సాధించాయి. అయితే ఈ రెండు జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు క్రికెట్ల ఆటతీరు ఇప్పుడు విమర్శలపాలైంది. ఒకరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ కాగా, మరొకరు న్యూజీలాండ్ ప్లేయర్ జిమ్మీ నీషమ్. వీరిద్దరూ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడారు. అయితే ఐపీఎల్‌లో వారి ప్రదర్శనకు, స్వదేశం తరఫున ఆడిన ఆటతీరుకు తేడాను పోలుస్తూ పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వీరిద్దరినీ ఉతికిపారేస్తున్నారు.

భారత్ ఆస్ట్రేలియా మూడు వన్డేల సరిస్‌లో భాగంగా శుక్రవారం నాడు సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 పరుగులు సాధించి అసిస్ గెలుపులో తనవంతు కీలక పాత్ర పోషించాడు ఆసిస్ బ్యాట్స్‌మెటన్ మాక్స్‌వెల్‌. ఇక వెస్టిండీస్‌-న్యూజీలాండ్‌ మధ్య జరిగిన తొలి టీ20లో 24 బంతుల్లో 48 పరుగులు చేసి న్యూజిలాండ్‌ విజయంలో జిమ్మీ నీషమ్ కీలక పాత్ర పోషించాడు. కాగా, వీరిద్దరూ ఐపీఎల్‌లో కనబరిచిన ఆటతీరును.. ఇప్పుడు వారి వారి స్వదేశాల తరఫున ఆడిన ఆట తీరును పోలుస్తూ భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మీమ్స్‌ క్రియేట్ చేసి మాక్స్‌వెల్‌, జిమ్మీ నీషమ్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ ప్రదర్శనేదో ఐపీఎల్‌లో చూపి ఉంటే.. పంజాబ్ పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. మీ దేశాలకు ఆడేటప్పుడు ఎంతటి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారో కేఎల్‌ రాహుల్‌ చూశాడు అంటూ ఓ అభిమాని సెటైర్ వేశాడు.

అయితే పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ అభిమానులు షేర్ చేసిన మీమ్‌కు జిమ్మీ నీషమ్, మాక్స్‌వెల్ స్పందించారు. ‘నిజాంగానే మంచి ఇన్నింగ్స్‌లు ఆడాం’ అంటూ సదరు మీమ్‌ను షేర్ నీషమ్ షేర్ చేయగా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే తాను కేఎల్ రాహుల్‌కు క్షమాపణలు చెప్పానంటూ మాక్స్‌వెల్ రిప్లై ఇచ్చాడు. మొత్తంగా వీరిద్దరిని పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ అభిమానులు మాత్రం ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.