‘కొవాగ్జిన్’ కరోనా టీకాపై ప్రధాని సమీక్ష.. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ సెంటిస్టులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ సెంటిస్టులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. వ్యాక్సిన్ అభివృద్ధిని సమీక్షించేందుకు హైదరాబాద్ జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ తయారీని పరిశీలించారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కొవాగ్జిన్ పురోగతిని తెలుసుకున్నారు. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందని శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. ఈ సంస్థ కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోందన్నారు. కోవిడ్ 19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటన అనంతరం ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
At the Bharat Biotech facility in Hyderabad, was briefed about their indigenous COVID-19 vaccine. Congratulated the scientists for their progress in the trials so far. Their team is closely working with ICMR to facilitate speedy progress. pic.twitter.com/C6kkfKQlbl
— Narendra Modi (@narendramodi) November 28, 2020