AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ బయోపిక్ హీరోకు బెదిరింపులు..!

బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్‌కు చంపేస్తామంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట. నక్సలైట్స్ పేరుతో ఆ కాల్స్ వచ్చినట్లు వివేక్ ఓబెరాయ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివేక్ నివాసం వద్ద బందోబస్తును పెంచారు పోలీసులు. ఇకపోతే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోదీ చిత్రం ఇవాళ విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపు […]

మోదీ బయోపిక్ హీరోకు బెదిరింపులు..!
Ravi Kiran
| Edited By: |

Updated on: May 24, 2019 | 6:18 PM

Share

బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్‌కు చంపేస్తామంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట. నక్సలైట్స్ పేరుతో ఆ కాల్స్ వచ్చినట్లు వివేక్ ఓబెరాయ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివేక్ నివాసం వద్ద బందోబస్తును పెంచారు పోలీసులు. ఇకపోతే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోదీ చిత్రం ఇవాళ విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం బాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది.

కాగా కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ని కించపరిచేలా వివాదాస్పదమైన ట్వీట్ చేశాడు వివేక్. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో.. ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు.