మోదీ.. సీటు ఖాళీ చేయండి: మన్మోహన్‌సింగ్

గత ఐదేండ్లలో యువతకు, రైతులకు తీరని నష్టం ప్రజాస్వామ్య సంస్థలన్నీ ఛిన్నాభిన్నం దేశాన్ని మాంద్యంవైపు నడుపుతున్నారు పెద్ద నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం విభజన రాజకీయాలకు, విద్వేషానికి బీజేపీ పర్యాయపదం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. మోదీ ఐదేళ్ల పాలనలో దేశంలోని యువతకు, రైతులకు, వ్యాపారులకు, ప్రతి ప్రజాస్వామ్య సంస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నిప్పులు […]

మోదీ.. సీటు ఖాళీ చేయండి: మన్మోహన్‌సింగ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 06, 2019 | 4:30 PM

  • గత ఐదేండ్లలో యువతకు, రైతులకు తీరని నష్టం
  • ప్రజాస్వామ్య సంస్థలన్నీ ఛిన్నాభిన్నం
  • దేశాన్ని మాంద్యంవైపు నడుపుతున్నారు
  • పెద్ద నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం
  • విభజన రాజకీయాలకు, విద్వేషానికి బీజేపీ పర్యాయపదం

ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. మోదీ ఐదేళ్ల పాలనలో దేశంలోని యువతకు, రైతులకు, వ్యాపారులకు, ప్రతి ప్రజాస్వామ్య సంస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నిప్పులు చెరిగారు. దేశంలో మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. సమ్మిళిత అభివృద్ధిని విశ్వసించకుండా కేవలం రాజకీయ అస్థిత్వం కోసం పాకులాడుతున్న మోదీ సర్కారును గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మోదీ హయాంలో అవినీతి అనూహ్యమైన స్థాయికి పెరిగిందని, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన అవినీతిపరులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు.