AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లలో ఆయన పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతమే లక్ష్యంగా ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు.

PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్ ఇదే!
Pm Modi Central Asia Visit
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 7:42 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లలో పర్యటించనున్నారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన సాగనుంది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో పర్యటించనున్నారు.. ఉజ్బెకిస్తాన్‌ లో ప్రధాని మోదీకి ఇది నాలుగోసారి పర్యటన. గతంలో 2015, 2016, 2022లో కూడా మోదీ ఉజ్బెకిస్తాన్‌ లో పర్యటించారు.

ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడితో చర్చలు

ప్రధాని మోదీ తాష్కెంట్‌లో అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరపనున్నారు. భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని సమీక్షించనున్నారు. వికసిత భారత్ 2047, ఉజ్బెకిస్తాన్-2030 అనే ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలపై కూడా ఇద్దరు నేతలు తమ ఆలోచనలు పంచుకోనున్నారు. ఈ పర్యటనలో తాష్కెంట్‌లోని శాస్త్రి స్మారక చిహ్నాన్ని, తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించే అవకాశం ఉంది.

కిర్గిజ్ రిపబ్లిక్ లో ప్రధాని మోదీ పర్యటన

ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజులపాటు ప్రధాని కిర్గిజ్ రిపబ్లిక్ లో బిష్కెక్‌లో పర్యటించనున్నారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఈ సమావేశం SCO 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతోంది. 2017 నుంచి SCO లో పూర్తి స్థాయి సభ్యదేశంగా ఉంది. భద్రత, అనుసంధానత, అవకాశాలు అనే భారత ప్రాధాన్యతలను మోదీ SCO సమావేశంలో ప్రస్తావించనున్నారు.

అనంతరం SCO సభ్యదేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. కీలక సమావేశాలు, ద్వైపాక్షిక చర్చలతో అనంతరం మధ్య ఆసియా గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్
చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్
చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!
కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్
కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్
నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. లింక్ ఇదే
నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. లింక్ ఇదే