క్యాప్సికంని క్యాప్సికం అని ఎందుకు పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?
Samatha
27 August 2026
క్యాప్సికం తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ దీనిని మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొనుగోలు చేస్తారు.
ఎందుకంటే? క్యాప్సికం అనేది దక్షిణ, మధ్య అమెరికాకు చెందిన ఒక కూరగాయ. దీనిని అనేక రకాల వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అంతే కాకుండా, ఇది పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. దీనిని వంటల్లో ఉపయోగించి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు క్యాప్సికంని క్యాప్సికం అని ఎందుకు అంటారో, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
బ్రిటిష్ వారు భారత దేశాన్ని పాలించిన విషయం తెలిసిందే. అయితే వారే దీనిని తీసుకొచ్చారంట. ముందుగా దీనిని సిమ్లాలో పండిచారంట. అక్కడ చల్లని వాతావరణంలో ఇది బాగా పండినది.
ఇక బ్రిటిష్ వారు దీనిని ఇండియాకు తీసుకొచ్చినప్పుడు, వారు దీనిని క్యాప్సికం అనే పిలిచారంట. అందువలన దీనిని క్యాప్సికం అంటారు. కానీ కొందరు సిమ్లా ఆపిల్ అని పిలుస్తారు.
ఇక దీని బొటానికల్ పేరు Capsicum annuum. ఇది లాటిన్ పదం Capsa నుండి వచ్చింది. Capsa అంటే 'ఖాళీ పెట్టె' అని అర్థం.
ఈ కాయను కట్ చేస్తే లోపల అంతా డొల్లాగా ఉంటుంది. ఇందులో ఏం ఉండదు. అందువలన దీనిని క్యాప్సికం అనేవారంట. అప్పటి నుంచి క్యాప్సికం అని పిలుస్తారు.