AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ తల్లి ధైర్యానికి సెల్యూట్.. బిడ్డ కోసం క్యాబ్ డ్రైవర్‌గా మారింది.. నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్

భర్త అండ లేకపోయినా తన బిడ్డను పెంచేందుకు ఓ తల్లి క్యాబ్ డ్రైవర్‌గా మారింది. చిన్న వయసు నుంచే డ్రైవింగ్ చేస్తున్న ఆమె.. కుటుంబ బాధ్యతల కోసం కష్టపడుతున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి..

ఆ తల్లి ధైర్యానికి సెల్యూట్.. బిడ్డ కోసం క్యాబ్ డ్రైవర్‌గా మారింది.. నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్
Female Taxi Drivers Story Wins Hearts Online
Srilakshmi C
|

Updated on: Aug 27, 2026 | 6:40 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని స్ఫూర్తిని కలిగిస్తాయి. ప్రస్తుతం ఓ మహిళా క్యాబ్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బిడ్డను పెంచేందుకు ఆమె క్యాబ్ నడుపుతున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

నేటి కాలంలో మహిళలు దాదాపు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. అయితే డ్రైవింగ్ వంటి కొన్ని వృత్తుల్లో మహిళల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఓ మహిళా డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ వీడియోలో ఓ ప్రయాణికురాలు క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా.. క్యాబ్‌ను ఓ మహిళ నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికురాలు ఆమెతో మాట్లాడటం వీడియోలో చూడొచ్చు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆ మహిళ కొన్ని విషయాలను వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

తాను ఓ బిడ్డకు తల్లినని, భర్త మద్దతు లేకుండానే తన బిడ్డను పెంచుకుంటున్నానని మహిళ చెప్పినట్లు వీడియోలో ఉంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆమె స్వయంగా సంపాదించుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను చిన్న వయసు నుంచే డ్రైవింగ్ చేస్తున్నానని కూడా ఆమె వెల్లడించింది. సుమారు 10 ఏళ్ల వయసు నుంచే డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జూన్ నుంచి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పింది. ఈ మహిళ తన పరిస్థితులకు వెనుకాడకుండా బిడ్డ కోసం కష్టపడుతున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కుటుంబ బాధ్యతలను మోస్తూనే స్వయం ఉపాధి ద్వారా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మహిళలు ఏ రంగంలోనైనా తమ సత్తా చాటగలరని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సందర్భం, మహిళ వివరాలు వంటి అంశాలు స్పష్టంగా తెలియాల్సి ఉన్నప్పటికీ.. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. బిడ్డ భవిష్యత్తు కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఈ మహిళ కథలో ఒక ముఖ్యమైన సందేశం ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనపై ఆధారపడిన వారి కోసం ధైర్యంగా నిలబడి, కష్టపడి పనిచేస్తే జీవితంలో ముందుకు సాగవచ్చనే విషయాన్ని ఆమె చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రస్తుతం ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తూ.. మహిళల ఆత్మవిశ్వాసం, స్వయం ఆధారిత జీవితం గురించి చర్చకు దారితీస్తోంది.

Follow Us