శబర్మతి నదితీరం నుంచి ‘సీప్లేన్’సర్వీస్, 31 న లాంచ్ చేయనున్న ప్రధాని మోదీ

Umakanth Rao

Umakanth Rao | Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2020 | 4:24 PM

గుజరాత్ లో తొలి సీ ప్లేన్ సర్వీసును ప్రధాని మోదీ  ఈ నెల 31 న లాంచ్ చేయనున్నారు. అహమ్మదాబాద్ లోని శబర్మతి నది తీరం  నుంచి నమద జిల్లా కెవాడియా కాలనీలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఈ ‘సముద్ర విమాన’ ప్రయాణం సాగనుంది. ఈ నెల 31 న సర్దార్ వల్లభ భాయ్ జయంత్యుత్సవం సందర్భంగా ఈ విశిష్టమైన విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. స్పైస్ జెట్ ఆధ్వర్యాన […]

శబర్మతి నదితీరం నుంచి 'సీప్లేన్'సర్వీస్, 31 న లాంచ్ చేయనున్న ప్రధాని మోదీ

గుజరాత్ లో తొలి సీ ప్లేన్ సర్వీసును ప్రధాని మోదీ  ఈ నెల 31 న లాంచ్ చేయనున్నారు. అహమ్మదాబాద్ లోని శబర్మతి నది తీరం  నుంచి నమద జిల్లా కెవాడియా కాలనీలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఈ ‘సముద్ర విమాన’ ప్రయాణం సాగనుంది. ఈ నెల 31 న సర్దార్ వల్లభ భాయ్ జయంత్యుత్సవం సందర్భంగా ఈ విశిష్టమైన విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. స్పైస్ జెట్ ఆధ్వర్యాన ఈ సౌకర్యాన్ని కలుగజేస్తున్నామన్నారు. 19 సీట్లున్న ఈ ప్లేన్ లో 12 మంది ప్రయాణించవచ్చు. అహమ్మదాబాద్ కెవాడియా మధ్య రోజుకు నాలుగు విమానాలు తిరుగుతాయని, ఒక్కో వ్యక్తి టికెట్ చార్జీ రూ. 4,800 అని ఆయన వివరించారు. ఈ ప్రయాణం సుమారు గంటపాటు ఉంటుందన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu