తొమ్మిది మంది ప్రాణాలు తీసిన ఎక్స్‌పైర్‌ అయిన ఫుడ్డు

కాలం తీరిన ఆహారపదార్థాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా విషపూరితాలే! పాపం ఈ విషయం తెలియక చైనాలోని ఓ కుటుంబంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.. ఏడాది పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచిన న్యూడిల్స్‌ తిన్నారు.. చావు కొని తెచ్చుకున్నారు.. హీలాంగ్జియాంగ్‌ నార్త్‌ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌లోని జీసీ నగరంలో ఈ విషాద సంఘటన జరిగింది.. అక్కడో కుటుంబం ఏడాది కిందట ఫ్రిడ్జ్‌లో పెట్టిన న్యూడిల్స్‌తో తయారు చేసిన వంటకాన్ని తిన్నారు.. చైనాలో దీన్ని సుఆన్‌టాంగ్జీ అంటారట! తిన్న వెంటనే వారు అస్వస్థతకు […]

తొమ్మిది మంది ప్రాణాలు తీసిన ఎక్స్‌పైర్‌ అయిన ఫుడ్డు
Follow us

|

Updated on: Oct 22, 2020 | 4:19 PM

కాలం తీరిన ఆహారపదార్థాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా విషపూరితాలే! పాపం ఈ విషయం తెలియక చైనాలోని ఓ కుటుంబంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.. ఏడాది పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచిన న్యూడిల్స్‌ తిన్నారు.. చావు కొని తెచ్చుకున్నారు.. హీలాంగ్జియాంగ్‌ నార్త్‌ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌లోని జీసీ నగరంలో ఈ విషాద సంఘటన జరిగింది.. అక్కడో కుటుంబం ఏడాది కిందట ఫ్రిడ్జ్‌లో పెట్టిన న్యూడిల్స్‌తో తయారు చేసిన వంటకాన్ని తిన్నారు.. చైనాలో దీన్ని సుఆన్‌టాంగ్జీ అంటారట! తిన్న వెంటనే వారు అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చారు.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తొమ్మిది మంది చనిపోయారు..అదే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు..వారికా ఆ వంటకం నచ్చక దాన్ని ముట్టుకోలేదు.. చెడిపోయిన ఆహారపదార్థాలలో బాంగ్‌క్రెక్‌ అనే విషం తయారవుతుందని, అదే వారి ప్రాణాలను తీసిందని హీలాంగ్జియాంగ్‌లోని ఓ డాక్టర్‌ తెలిపారు. బాంగ్‌క్రెక్‌ కనుక మన శరీరంలో ప్రవేశిస్తే వెంటనే ప్రభావం చూపుతుందట. గంటల్లోనే ప్రాణం పోతుందట! ఆ విషం శరీరంలోని కీలక అవయవాలైన మూత్రపిండాలు, కాలేయం, గుండె, మెదడును దెబ్బ తీస్తుందని…. ప్రస్తుతం దానికి విరుగుడు మందు లేదని డాక్టర్లు చెబుతున్నారు. పాడైపోయిన ఆహారపదార్థాలను వేడి చేసుకుని తిన్నా ముప్పేనని, ఎంత వేడి చేసినా బాంగ్‌క్రెక్‌ నశించదని అంటున్నారు. మనం ఎంత వేడి చేసినా బాంగ్‌క్రెక్‌ నశించదు.

Latest Articles