సాక్షాత్తూ ప్రధాని మోదీ ప్రకటన, రైతులతో ఇకపై చర్చలు ఉండబోవని ప్రకటించి, కాస్త వెనక్కి తగ్గిన కేంద్రం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఇకపై చర్చలు ఉండబోవని ప్రకటించిన కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. కిషాన్ సంఘాలు ఒక్క ఫోన్..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఇకపై చర్చలు ఉండబోవని ప్రకటించిన కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. కిషాన్ సంఘాలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మంత్రులు చర్చలకు వెళ్తారని స్వయంగా ప్రధానమంత్రి మోదీనే ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్షం భేటీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెషన్స్ సజావుగా సాగేందుకు కేంద్రం ఈ చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.