AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచండి.. కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని పేర్కొంది. సాధ్యమైన వైద్య కేంద్రాల్లో ఒకటికి మించి వ్యాక్సినేషన్ సెషన్లను..

టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచండి.. కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 5:33 PM

Share

Covid Vaccine : కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని పేర్కొంది. సాధ్యమైన వైద్య కేంద్రాల్లో ఒకటికి మించి వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ఫిబ్రవరి చివరి వారం నుంచి కోవిడ్ ఫ్రంట్​లైన్ వర్కర్లకు టీకా పంపిణీ ప్రారంభించాలని పేర్కొంది.

పలు రాష్ట్రాల్లో టీకా తీసుకున్న లబ్ధిదారుల కవరేజీ 50 శాతం కన్నా కాస్త ఎక్కువ ఉందని.. అయితే ఆయా రాష్ట్రాలన్నీ కవరేజీని పెంచాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని కోరారు. కరోనా టీకా డోసులు కావాల్సినన్ని నిల్వ ఉన్నాయని తెలిపారు. కోవిన్ యాప్​లో సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ కార్యదర్శి సూచించారు. తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఒక్కో సెషన్​లో ఇచ్చే టీకాల సంఖ్యను మరింత పెంచడానికి తగినంత ఆస్కారం ఉందని చెప్పారు.  సాధ్యమైన వైద్య కేంద్రాల్లో ఒకటికి మించి వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించాలని అన్నారు. ఇలా చేయడం వల్ల రోజువారి వ్యాక్సినేషన్ సంఖ్య పెరుగుతుందన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సంబంధిత సెషన్ల నోడల్ అధికారులతో సంప్రదించి.. ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నించాలని అన్నారు.  ప్రాధాన్య జాబితాలో ఉన్న వ్యక్తులకే టీకా ఇవ్వాలని స్పష్టం చేశారు భూషణ్. వారిని జాగ్రత్తగా గుర్తించాలని అన్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

Follow Us
ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు..
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం
జాకబ్ అండ్ కో ‘శ్రీ రామచంద్ర’ వాచ్.. ధర రూ. 4.25 కోట్లు!
జాకబ్ అండ్ కో ‘శ్రీ రామచంద్ర’ వాచ్.. ధర రూ. 4.25 కోట్లు!