PM-KISAN Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రైతు కేవలం ఆరువేలే కాదు ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చో తెలుసా..!
లాభ నష్టాల బేరీజు వేసుకోకుండా ప్రకృతి పగబట్టినా.. సాటి మనిషి స్వార్ధం చూసుకున్నా.. కాడి పడెయ్యకుండా వ్యయప్రయాసల కోర్చి మన అందరికీ అన్నం పెట్టి.. తాను అన్నం తినడానికి మెతుకులు లెక్కించుకునేవాడు అన్నదాత...
PM-KISAN Scheme: జై జవాన్ , జై కిసాన్ అన్నది మన దేశ నినాదం.. దేశానికి రక్షణగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కావాలా కాసేది జవాన్లు అయితే.. లాభ నష్టాల బేరీజు వేసుకోకుండా ప్రకృతి పగబట్టినా.. సాటి మనిషి స్వార్ధం చూసుకున్నా.. కాడి పడెయ్యకుండా వ్యయప్రయాసల కోర్చి మన అందరికీ అన్నం పెట్టి.. తాను అన్నం తినడానికి మెతుకులు లెక్కించుకునేవాడు అన్నదాత.. ఇక దేశంలోని రైతుల ప్రయోజనం కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకుని వచ్చారు. ఈ పధకంలో చేరిన రైతులు కేవలం ఏడాదికి రూ. 6 వేలను పొందుతారు. అయితే ఈ పథకం ద్వారా అన్నదాతకు ఆరువేలే కాదు.. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం..!
అన్నదాతకు అండగా ఆర్ధికంగా ఆదుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. రైతుల ఖాతాలో ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేలు చొప్పున డబ్బులు అన్నదాతలకు లభిస్తున్నాయి.
ఈ స్కీమ్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం 7 విడతల డబ్బును జమ చేసింది. ఇక వచ్చే నెలలో 8వ విడత డబ్బులు కూడా అందించనున్నారు. అయితే కేవలం ఈ డబ్బులు మాత్రమే రైతులకు మాత్రమే వస్తాయి అనుకుంటే పొరపాటు. మరి కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఈ స్కీమ్ లో ఉన్నాయి.
పీఎం కిసాన్ స్కీమ్ లో ఉన్న రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను (KCC) సులభంగా పొందొచ్చు. ఈ కార్డు ఉన్న రైతులకు తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
ఇక కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో సులభంగా అన్నదాత చేరవచ్చు. రైతులకు వచ్చే రూ.6 వేల నుంచే నెలవారీ డబ్బులు ఈ పథకంలో కట్టవచ్చు. అలానే కిసాన్ కార్డు కూడా పొందవచ్చు. ఈ పథకంలో చేరిన రైతులకు ప్రత్యేక ఫార్మర్ ఐడీ ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డులు ఉన్న రైతుల భూములను లింక్ చేయాలని భావిస్తోంది. కనుక రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లో ఉంటె నేరుగా రైతులకి ఏ పథకం వచ్చినా అందులో ఉండే ప్రయోజనాలు చేరతాయి.
Also Read: