AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam News: ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..

ప్లేస్‌.. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్‌ గేట్‌..! పోలీస్‌ ఎస్కార్ట్‌ తో ఒక వాహనం అక్కడకు చేరుకుంటుంది. ఈలోగా చుట్టుపక్కల నుంచి కొంతమంది దుండగులు పరిగెత్తుకుంటూ వచ్చారు.

Visakhapatnam News: ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..
Pigs Vehicle
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2021 | 6:08 PM

Share

ప్లేస్‌.. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్‌ గేట్‌..! పోలీస్‌ ఎస్కార్ట్‌ తో ఒక వాహనం అక్కడకు చేరుకుంటుంది. ఈలోగా చుట్టుపక్కల నుంచి కొంతమంది దుండగులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ముందున్న ఎస్కార్ట్‌ వాహనాన్ని వదిలి వెనుకున్న వాహనంపైకి దూసుకువెళ్ళారు. డ్రైవర్‌పై దాడి చేయడంతో పరుగులు తీశాడు. ఈలోగా దుండగులంతా ఆ వాహనాన్ని ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనతో కంగుతిన్న ఎస్కార్ట్‌ సిబ్బంది… ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంతకీ ఆ వాహనంలో ఉన్నదేంటంటే.. ఊర పందులు..! విజయనగరం నుంచి తరలిస్తున్నారు.

విజయనగరం మున్సిపాలిటీలో సంచరించే పందులను పట్టుకుని.. వాటిని చెన్నైకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఎస్కార్ట్‌ కూడా జతచేశారు. అయితే.. గత రాత్రి ఈ వాహనాలు హైవే మీదుగా విజయనగరం నుంచి విశాఖ జిల్లా నక్కపల్లి వరకు చేరుకున్నాయి. ముందు ఎస్కార్ట్‌ వాహనం.. వెనుక పందులతో కూడిన మరో బొలేరో. ఈ వాహనాలు రెండూ నక్కపల్లి టోల్‌ గేట్‌ వద్ద వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో అప్పటికే అక్కడ కాపు కాసిన దుండగులు.. పరుగెత్తికుని వచ్చి వాహనాలను చుట్టుముట్టారు. ఎస్కార్ట్‌ వెనుకున్న పందుల వాహనం నడుపుతున్న డ్రైవర్‌పై దాడి చేశారు. భయంతో డ్రైవర్‌ కిందకు దిగి ఎస్కార్ట్‌ వైపు పరిగెత్తాడు. ఈ లోగా పందుల వాహనాన్ని బ్యాక్‌ చేసుకుని ఎత్తుకెళ్ళారు దుండగులు. అయితే.. అక్కడే ఉన్న ఎస్కార్ట్‌ సిబ్బంది చూస్తూ ఊరుకుండిపోయారే తప్పా ఏమీ చేయలేకపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది.

విషయాన్ని స్థానిక నక్కపల్లి పోలీసులకు ఎస్కార్ట్‌ సిబ్బంది సమాచారాన్ని అందించారు. పోలీసులు అలర్టయ్యే సరికి కొద్ది దూరం వెళ్లాక పందుల వాహనాన్ని ఆపి దుండగులు పారిపోయారు. ఎస్కార్ట్‌ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వాహనాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు నక్కపల్లి సీఐ నారాయణరావు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది పందుల యజమానులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. విజయనగరం అధికారులతో పోలీసులు మాట్లాడుతున్నారు. ఎస్కార్ట్‌ సిబ్బంది వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసులు. మొత్తంమ్మీద ఎస్కార్ట్‌ ఉన్న వాహనాన్నే దుండగులు హైజాక్‌ చేశారంటే.. పరిస్థితి ఎలా వుందో అర్థంచేసుకోవచ్చు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.

Also Read:కత్తి మహేష్‌కు చికిత్స నిమిత్తం సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం.. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే

 ‘అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి’.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!