పాక్‌లో భారత సినిమాలను నిషేధించాలంటూ పిటిషన్

లాహోర్: భారత్‌‌ సినిమాల్ని పాకిస్థాన్‌లో పూర్తిగా నిషేధించాలని షేక్ మహ్మద్ లతీఫ్ అనే వ్యక్తి లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2016 ఫెడరల్‌ గవర్నమెంట్‌ దిగుమతి‌ విధానం ప్రకారం ఇండియా సినిమాల ప్రసారాన్ని నిషేధించాలని కోరాడు. ఫిబ్రవరి 24న పుల్వామా దాడి తర్వాత ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ భారత్‌లో పాకిస్థాన్‌ కళాకారులను నిషేధించిందని ఆయన‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ టీవీ ఛానళ్లలో భారత్‌ కంటెంట్‌ ప్రసారంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. […]

పాక్‌లో భారత సినిమాలను నిషేధించాలంటూ పిటిషన్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:35 PM

లాహోర్: భారత్‌‌ సినిమాల్ని పాకిస్థాన్‌లో పూర్తిగా నిషేధించాలని షేక్ మహ్మద్ లతీఫ్ అనే వ్యక్తి లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2016 ఫెడరల్‌ గవర్నమెంట్‌ దిగుమతి‌ విధానం ప్రకారం ఇండియా సినిమాల ప్రసారాన్ని నిషేధించాలని కోరాడు. ఫిబ్రవరి 24న పుల్వామా దాడి తర్వాత ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ భారత్‌లో పాకిస్థాన్‌ కళాకారులను నిషేధించిందని ఆయన‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ టీవీ ఛానళ్లలో భారత్‌ కంటెంట్‌ ప్రసారంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పుల్వామా ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ భారత్‌లో పాకిస్థాన్‌ కళాకారులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ సినిమాల్ని కూడా పాక్‌లో పూర్తిగా నిషేధించాలంటూ షేక్‌ మహ్మద్‌ లతీఫ్‌ పిటిషన్‌ వేశారు.