CM Chandrababu: కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎల్లుండి నుంచి ఢిల్లీలో పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఉభయసభల్లో అనుసరించాల్సి వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే.. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఎంపీలు, మంత్రులతో కలిపి ఉమ్మడి సమావేశం నిర్వహించి సరికొత్త పద్దతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

CM Chandrababu: కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ..
AP CM Chandrababu Naidu
Follow us

|

Updated on: Jul 20, 2024 | 10:49 PM

సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎల్లుండి నుంచి ఢిల్లీలో పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఉభయసభల్లో అనుసరించాల్సి వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే.. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఎంపీలు, మంత్రులతో కలిపి ఉమ్మడి సమావేశం నిర్వహించి సరికొత్త పద్దతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధులను సాధించడమే లక్ష్యంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి కేంద్రమంత్రులు, ఎంపీలు, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరుకాగా.. పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా.. ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పనిచేయాలని ఎంపీలు, మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సమీకరణకు మంత్రులు, ఎంపీలతో కలిపి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రుల నుంచి పెండింగ్ ప్రాజెక్ట్‌ల సమాచారాన్ని సేకరించి.. వారిని వెంట తీసుకుని వెళ్లి.. కేంద్రమంత్రులను కలవాలని ఆదేశించారు.

ఇక.. వినూత్నంగా రాష్ట్ర మంత్రులతో కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించడం హర్షనీయమన్నారు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. మంత్రుల శాఖల వారీ సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి మూడు, నాలుగు డిపార్ట్‌మెంట్లు కేటాయించారని తెలిపారు. కేంద్ర పథకాల్లో ఏపీకి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు ఎంపీ కేశినేని చిన్ని. మరోవైపు.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన.. ఎంపీల పరిధిలోని సమస్యలను కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ క్రమంలోనే.. ఉత్తరాంధ్రకు చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్‌, రైల్వేజోన్‌ అంశాలు చర్చకు వచ్చాయని.. వాటికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక.. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏపీ చాలా నష్టపోయిందన్నారు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు. మొత్తంగా.. ఏపీ అభివృద్ధి, పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల నిధులు సాధించడమే లక్ష్యంగా టీడీపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర మంత్రులతో కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఒక్కో ఎంపీకి మూడు, నాలుగు శాఖల బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?
ఈ ట్యాగ్ ఉంటే చాలు.. మీ వస్తువులు సేఫ్‌..
ఈ ట్యాగ్ ఉంటే చాలు.. మీ వస్తువులు సేఫ్‌..
స్మార్ట్‌ టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? కళ్లు చెదిరే డిస్కౌంట్స్
స్మార్ట్‌ టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? కళ్లు చెదిరే డిస్కౌంట్స్
జాన్వీకి నాకు మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదు.. బాలీవుడ్ హీరో
జాన్వీకి నాకు మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదు.. బాలీవుడ్ హీరో