ఇండియాతో అణు యుధ్ధం చేస్తాం, పాక్ మంత్రి ‘గర్జన’ !
ఇండియాతో అణుయుధ్ధం చేస్తామని పాకిస్తాన్ మంత్రి ఒకరు బీరాలు పలికారు. ఆ దేశంలో రైల్వే శాఖ మంత్రి అయిన షేక్ రషీద్ అనే ఈయన, ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ..

ఇండియాతో అణుయుధ్ధం చేస్తామని పాకిస్తాన్ మంత్రి ఒకరు బీరాలు పలికారు. ఆ దేశంలో రైల్వే శాఖ మంత్రి అయిన షేక్ రషీద్ అనే ఈయన, ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ..భారత ఆర్మీ.. తమ దేశ సైన్యంకన్నా శక్తివంతమైనదన్నారు. అయితే తమ దేశం వద్ద చిన్నపాటి అణ్వాయుధాలు ఉన్నాయని, తాము తలచుకుంటే అస్సాం వరకు భారత దేశంలోని వివిధ నగరాలను టార్గెట్ చేయగలుగుతామని ఆయన చెప్పారు. కానీ ముస్లిములను మాత్రం వదిలేస్తాం అన్నారు. షేక్ గారు ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు.. గత ఏడాది సెప్టెంబరులో కూడా ఆయన.. పాకిస్థాన్ ఆర్మీ వద్ద 125 నుంచి 250 గ్రాముల బరువుండే అణ్వాయుధాలు ఉన్నాయని, కానీ అవి చిన్నపాటి లక్ష్యాలను ఛేదించగలుతాయని తెలిపారు.
కాగా- ఆయన ప్రకటనలు వట్టిపేలాపనలే అని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. అణు యుధ్ధమంటే మామూలు వార్ కాదని, షేక్ రషీద్ ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, అందులోనూ మంత్రి అయిన ఈయన అర్థంలేని ప్రకటనలు చేయరాదని అంటున్నారు.