సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. అప్రమత్తమైన బీఎస్ఎఫ్

శ్రీనగర్ : సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. పుల్వామా దాడి అనంతరం భారత్ చేపట్టిన వాయుసేన దాడుల తర్వాత నిత్యం పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు ఐదు పాకిస్థాన్ డ్రోన్ లను భద్రతాదళాలు ధ్వంసం చేశాయి. తాజాగా బుధవారం భారత సరిహద్దుల వెంట ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించినట్లు భారత సరిహద్దు భద్రతాదళం తన రహస్య నివేదికలో వెల్లడించింది. పాక్ సరిహద్దుల్లోని ఉరి, పూంచ్, రాజౌరి, నౌషెరా, సుందర్ […]

సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. అప్రమత్తమైన బీఎస్ఎఫ్
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 1:36 PM

శ్రీనగర్ : సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. పుల్వామా దాడి అనంతరం భారత్ చేపట్టిన వాయుసేన దాడుల తర్వాత నిత్యం పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు ఐదు పాకిస్థాన్ డ్రోన్ లను భద్రతాదళాలు ధ్వంసం చేశాయి. తాజాగా బుధవారం భారత సరిహద్దుల వెంట ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించినట్లు భారత సరిహద్దు భద్రతాదళం తన రహస్య నివేదికలో వెల్లడించింది. పాక్ సరిహద్దుల్లోని ఉరి, పూంచ్, రాజౌరి, నౌషెరా, సుందర్ బనీ తదితర 12 ప్రాంతాల్లో పాక్ ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించిందని బీఎస్ఎఫ్ పేర్కొంది. గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎగురుతున్న పాక్ డ్రోన్ ను భారత సైన్యం ఇటీవల కూల్చివేసింది. పాక్ డ్రోన్లతో సరిహద్దుల్లో నిఘా వేయడంతో మన భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్థాన్ గత ఏడాది చైనా నుంచి 48 వింగ్ లూంగ్ డ్రోన్లను కొనుగోలు చేసింది. పాక్ మిలటరీకి తమ వంతు సాయం చేస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గతంలోనే ప్రకటించారు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు ఎగురుతున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ డ్రోన్ల ఎత్తుగడను చిత్తు చేసేందుకు భారత ఆర్మీ చర్యలు చేపట్టింది