తెలంగాణలో జూన్ 8 వరకు కొనసాగింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయం ప్రభావం జూన్ 8వ తేదీ దాకా కొనసాగనున్నది.

తెలంగాణలో జూన్ 8 వరకు కొనసాగింపు
Follow us

|

Updated on: May 30, 2020 | 4:31 PM

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. తొలుత రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మే 31వ తేదీ వరకే నిర్వహించాలని సర్కార్ భావించింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండడం, గత వారం రోజులుగా వర్షాలు తదితర కారణాలతో ధాన్యం సేకరణ పూర్తికాకపోవడం వల్ల మరికొన్ని రోజులు ధాన్యం సేకరణ కేంద్రాలను కొనసాగించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గ్రౌండ్ లెవెల్ పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం.

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం పండిన నేపథ్యంలో తుది గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పలు మార్లు ప్రకటనలు కూడా చేశారు. అకాల వర్షాలతో రైతాంగం పడుతున్న ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకున్న సీఎం ధాన్యం సేకరణను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Latest Articles