లాక్‌డౌన్ తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం..?
దాదాపు పది లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేందకే మొగ్గుచూపుతారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ సమయంలో ఐటీ సంస్థలు

Work from home: దాదాపు పది లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేందకే మొగ్గుచూపుతారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ సమయంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేసేలా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20 నుంచి 30 శాతం మంది ఐటీ ఉద్యోగులు లాక్‌డౌన్ తర్వతా ఇంటి నుంచి పనిచేసేందుకే ఆసక్తి చూపుతారని గోపాలకృష్ణన్ అన్నారు.
కాగా.. లాక్ డౌన్ నేపథ్యంలో.. ఇప్పటికే పలు భారతీయ అంకుర సంస్థలు తమ ఉద్యోగులు ఇళ్ల నుంచి మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాయని, దీంతో అంకుర సంస్థలు ప్రత్యేకంగా కార్యాలయం నిర్వహించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలిపారు. ”గతంలో జరిగినట్లు వ్యాపార పద్ధతులు ఉండకపోవచ్చు. సంస్థలు తమకు కార్యాలయ నిర్వహణ కోసం స్థలం లేకపోయినా, రాబోయే రోజుల్లో తమ సేవలను ఎలా అందించాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయి” అని తెలిపారు.
మరోవైపు.. పెద్ద ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 95 శాతం ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఈ మార్పు చాలా వేగంగా సంభంవించింది. రాబోయే రోజుల్లో ఇదే పద్ధతి కొనసాగుతూ, వ్యాపారంలో ఒక భాగం అవుతుంది అని గోపాలకృష్ణన్ వివరించారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..



