AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ‘ఆపరేషన్‌ సుర’..రంగంలోకి 10 వేల మంది సిబ్బంది..

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ‘ఆపరేషన్‌ సుర’ కొనసాగుతోంది. డీజీపీ ఆదేశాలతో అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. పదివేల మంది సిబ్బందితో ఆపరేషన్ కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు, ఎక్చైజ్‌శాఖ సమన్వయంతో దాడులు చేశారు. నాటుసారా నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లాలో పలు చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. తోటనండూరు మండలంలో రెండున్నర వేల […]

ఏపీలో 'ఆపరేషన్‌ సుర'..రంగంలోకి 10 వేల మంది సిబ్బంది..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 11, 2020 | 1:06 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ‘ఆపరేషన్‌ సుర’ కొనసాగుతోంది. డీజీపీ ఆదేశాలతో అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. పదివేల మంది సిబ్బందితో ఆపరేషన్ కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు, ఎక్చైజ్‌శాఖ సమన్వయంతో దాడులు చేశారు. నాటుసారా నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లాలో పలు చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. తోటనండూరు మండలంలో రెండున్నర వేల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జగ్గంపేట, కొత్తూరు, తిమ్మాపురాలలో నిల్వ ఉంచిన బెల్లం ఊట, నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు పోలీసులు. ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా మెరుపుదాడులు కొనసాగుతున్నాయి.

చీరాల సిటీలో నాటుసారా విక్రయిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. వి చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

క‌ృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో నాటుసారా విక్రేతలపై ఎక్సైజ్‌ సిబ్బంది, పోలీసులు దాడులు చేశారు. బంటుమిల్లి మండలంలోని రామవరపుమోడి గ్రామంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి..అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.   అర్తమూరు మల్లాయి చెరువు వద్ద పోలీసులు.. 200 లీటర్ల బెల్లంఊట, 10 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో 500 లీటర్ల బెల్లం ఊట,  చినగొల్లపాలెంలో 200 లీటర్ల బెల్లం ఊట, పోడు గ్రామంలో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి.

Follow Us
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..