హరీష్‌రావు సూచనలతోనే ఈటల రాజేందర్ మాట్లాడారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
గోదావరి జలాల వినియోగంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన బీఆర్ఎస్ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లో తలెత్తిన సమస్యలను ప్రస్తావిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే లోపాలు బయటపడ్డాయని సీఎం పేర్కొన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో కూడా ఈ అంశాలు స్పష్టంగా నమోదయ్యాయని వెల్లడించారు.

గోదావరిలో పారుతున్న నీటిని ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.. ఈ సమయంలో నీళ్లపై రాజకీయాలు వద్దంటూ హితవు పలికారు.. అయితే ఈటల కామెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. క్యాంప్ ఆఫీస్‌లో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల అంటే తమకు గౌరవమేనన్న సీఎం రేవంత్ రెడ్డి.. కాళేశ్వరంపై ఈటల రాజేందర్ అవాస్తవాలు చెప్పారన్నారు. ఈటల కూడా BRS ఎజెండా ఎత్తుకున్నారంటూ విమర్శించారు. హరీష్‌రావు సూచనలతోనే ఈటల మాట్లాడారని.. ఈటల ఇప్పుడు గౌరవం పొగొట్టుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2019 జూన్‌లో కాళేశ్వరం ప్రారంభించారని.. 2020 మేలో లోపాలు బయటపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 11 నెలల్లోనే అధికారులు లోపాలు గుర్తించారన్నారు. KCR ఉన్నప్పుడే లోపాలు తెలిశాయన్నారు. నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ కుప్పకూలిందన్నారు. 2022 జూలైలో కన్నెపల్లి పంప్‌హౌస్ దెబ్బతిందని వివరించారు. ఇప్పటికీ కన్నెపల్లి వినియోగంలోకి రాలేదని వివరించారు.2023 అక్టోబర్‌లో NDSA కమిటీ వేసిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నివేదిక ఇచ్చారని.. లోపాలపై NDSA నివేదికలో పేర్కొన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
