AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఈ చిన్ననాటి స్నేహితులను గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోలయినా అదే బాండింగ్

స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ తమ బెస్ట్ ఫ్రెండ్స్ కు విషెస్ చెబుతున్నారు. వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అలా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఈ జోడీ కూడా ఒకటి.

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఈ చిన్ననాటి స్నేహితులను గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోలయినా అదే బాండింగ్
Simbhu And Arun Vijay
Basha Shek
|

Updated on: Aug 02, 2026 | 11:24 AM

Share

పై ఫొటోలో ఉన్న ఇద్దరు అబ్బాయిలను గుర్తు పట్టారా? వీరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఎంతలా అంటే ఇప్పుడు వీరు పెద్ద స్టార్ హీరోలయ్యారు. కోట్లాది మంది అభిమానులతో పాటు ఎంతో క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్నారు. అయినా ఇప్పటికీ మంచి స్నేహితులుగా తమ బాండింగ్‌ ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. ఒకరు స్టార్ నటుడి, నటి కుమారుడు అయితే.. మరొకరు స్టార్ డైరెక్టర్ కొడుకు. తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ వీరు కూడా చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఛైల్డ్ ఆర్టిస్టుటుగా తమ క్యూట్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఆ తర్వాత హీరోలుగా నూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. తమ నటనతో ఫుల్ క్రేజ్, పాపులారిటీతో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయినా వీరు ఇప్పటికీ తమ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. మరి వీరెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. వీరు మరెవరో కాదు కోలీవుడ్ స్టార్స్ శింబు, అరుణ్ విజయ్. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం (ఆగస్టు 02) నేపథ్యంలో ఈ స్టార్ హీరోల చిన్ననాటి ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన టి. రాజేందర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు శింబు. చిన్నప్పుడే ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ అయ్యాడు. ఇక అరుణ్ విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన విజయ్ కుమార్ కుమారుడే ఈ అరుణ్ విజయ్. తమిళంలో హీరోగా రాణిస్తోన్న ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే ప్రభాస్ నటించిన సాహోలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు.

ఇవి కూడా చదవండి

లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చెక్క చివంద వానమ్‌ (తెలుగులో నవాబ్) సినిమాలో శింబు, అరుణ్ విజయ్ అన్నదమ్ములుగా నటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక శింబు ప్రస్తుతం అరసన్ తో పాటు ఎస్‌టీఆర్ 50, ఎస్‌టీఆర్ 51 సినిమాల్లో నటిస్తున్నాడు. అరుణ్ విషయానికి వస్తే.. ధునుష్ హీరోగా తెరకెక్కిన ఇడ్లీ కడైలో విలన్ గా ఆకట్టుకున్నాడీ. ప్రస్తుతం ఈ స్టార్ చేతిలోనూ పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

శింబు, అరుణ్ విజయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us