Telangana: ఆ వ్యక్తి ఆచూకీ తెలిపితే రూ.2లక్షల రివార్డు.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన!
తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన షాబాద్ ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌పై పోలీసులు రూ. 2 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ఈ నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన షాబాద్ ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌పై పోలీసులు రూ. 2 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ఈ నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు.మరోవైపు ఈ కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. నిందితుడి కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్‌కుమార్ షాద్‌నగర్‌కు అద్దె కారులో వచ్చినట్లు గుర్తించిన పోలీసులు, సదరు కారు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ (NHRC)కి ఫిర్యాదు
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై న్యాయవాది రామారావు ఇమ్మనేని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి ఫిర్యాదు చేశారు. గతంలోనే బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక సీఐ, ఎస్ఐలు నిర్లక్ష్యం వహించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్‌లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే పోక్సో (POCSO) బాధితురాలితో పాటు ఆరుగురిని బలితీసుకున్న సైకో కిల్లర్‌పై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, బాధితురాలి కుటుంబ సభ్యులకు తక్షణమే రక్షణ కల్పించాలని న్యాయవాది కోరారు.
పోలీసులపై చర్యలు
ఈ వ్యవహారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి వెళ్లడంతో పోలీసులు కూడా వేగంగా స్పందించారు. కేసు పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. షాబాద్ సీఐ కాంతారెడ్డికి చార్జ్‌మెమో జారీ చేయగా, ఎస్సై రమేష్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ (సీపీ) ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
