AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆటో డ్రైవర్‏గా మారిన నటుడు..

ఒకప్పుడు నటుడిగా సినీరంగంలో తనదైన ముద్ర వేసినవారు చాలా మంది ఉన్నారు. అలాగే చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించినవారు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మెప్పిస్తున్నారు. కానీ కొందరు చైల్డ్ ఆర్టిస్టులు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోంటూ జీవనం సాగిస్తున్నారు.

Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆటో డ్రైవర్‏గా మారిన నటుడు..
Shafiq Syed
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2026 | 6:00 PM

Share

సామాన్య కుటుంబంలో జన్మించిన చిన్నోడు.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. కానీ ఇప్పుడు అతడి జీవితం ఒక సినిమా కథలా మారిపోయింది. ఒకప్పుడు భారీ విజయాన్ని అందుకున్న సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన ఆయన… ఆ తర్వాత మాత్రం చిత్ర పరిశ్రమలో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయాడు. అతడి నటనకు జాతీయ అవార్డ్ వచ్చినప్పటికీ.. ఇండస్ట్రీ మాత్రం అతడి టాలెంట్ గుర్తించలేకపోయింది. ఛాన్సుల కోసం ఎన్నో స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ నటుడిగా అవకాశం రాలేదు. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి అతడు ఆటో డ్రైవర్ గా మారాడు. ఆ నటుడి పేరు షఫిక్ సయ్యద్. అతడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు.

ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..

1980వ దశకంలో షఫిక్ సయ్యాద్.. బెంగుళూరులోని తన ఇంటి నుంచి పారిపోయి టికెట్టు లేకుండానే ముంబైకి చేరుకున్నాడు. హిందీ సినిమాల్లో చిూపించినట్లుగా ముంబై నిజ జీవితంలో ఎలా ఉంటుందో చూడాలి అతడు కోరుకున్నాడు. ముంబైకి వచ్చిన తర్వాత అతడు చర్చ్ గేట్ స్టేషన్ సమీపంలోని వీధుల్లో నివసించాడు. అప్పుడే ఒక మహిళా కాస్టింగ్ ఏజెంట్ అతడిని సంప్రదించింది. వీధి పిల్లలను ఒక యాక్టింగ్ వర్క్ షాప్ లో పాల్గోనేలా చేయడానికి వారికి ఒక్కొక్కరికి రూ.20 ఇస్తానని చెప్పింది. ఇది మోసమని భావించిన పిల్లలు పారిపోయారు. కానీ ఆకలితో ఉన్న షఫిక్ మాత్రం ఆ అవకాశాన్ని ఒప్పుకున్నాడు. అదే వర్క్‌షాప్ నుండి, దర్శకురాలు మీరా నాయర్ తీసిన ‘సలామ్ బాంబే!’ చిత్రంలో ప్రధాన బాల పాత్రకు అతను ఎంపికయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

1988లో విడుదలైన ‘సలామ్ బొంబాయి’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ చేయబడింది. ఈ చిత్రం అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. షఫిక్ నటన కూడా విశేష ప్రశంసలు రావడమే కాకుండా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. విజయం తనకు నటనారంగంలో గొప్ప అవకాశాలను తెస్తుందని షఫిక్ ఆశించాడు. కానీ జాతీయ పురస్కారం అందుకున్న తర్వాత కూడా షఫిక్‌కు ఏ పెద్ద సినిమాలోనూ అవకాశం రాలేదు. దీంతో షఫిక్ చివరకు ముంబైని విడిచిపెట్టి బెంగళూరుకు తిరిగి వచ్చాడు. ఐదుగురు సభ్యులున్న తన కుటుంబాన్ని పోషించడానికి ఆటో డ్రైవర్ అయ్యాడు. ఇప్పటికీ ఆటో డ్రైవర్ గానే పనిచేస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

షఫిక్ సయ్యాద్..

Shafiq Syed

Shafiq Syed

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us