రామకృష్ణ మఠంలో ఆన్ లైన్ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్..

  • Sanjay Kasula
  • Publish Date - 8:51 pm, Tue, 8 September 20
రామకృష్ణ మఠంలో ఆన్ లైన్ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు

Ramakrishna Math Spoken English  : రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా పదవ(10వ )తరగతి పాస్ అయి ఉండాలి. శిక్షణకు సంబంధించిన పుస్తకములు పోస్ట్ ద్వారా పంప బడును. ఇతర సందేహాలకు 040- 27635545, ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. రామకృష్ణ మఠం లింక్ ద్వారా అడ్మిషన్ పొందాలని సూచించారు.

ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఇతర భాషలు కూడా రామకృష్ణ మఠంలో నేర్పుతారు.
స్పోకెన్ సంస్కృతం, హిందీ, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, చైనీస్ కూడా నేర్పుతారు.