ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అప్పులు.. వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య

ఆన్‌లైన్‌లో అప్పులిస్తామంటూ వెంట పడతారు. తీసుకున్నాక, కాస్త ఇబ్బంది ఏమైతే చచ్చేదాకా వేధిస్తుంటారు. ఇలా వేధింపుల భరించలేక ఓ విద్యార్థి బలైపోయింది.

ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అప్పులు.. వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య
Follow us

|

Updated on: Nov 04, 2020 | 3:26 PM

ఆన్‌లైన్‌లో అప్పులిస్తామంటూ వెంట పడతారు. తీసుకున్నాక, కాస్త ఇబ్బంది ఏమైతే చచ్చేదాకా వేధిస్తుంటారు. ఇలా వేధింపుల భరించలేక ఓ విద్యార్థి బలైపోయింది. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అవసరార్థం రుణాలు తీసుకున్న ఎంబీఏ విద్యార్థిని వాటిని తీర్చలేక మనస్తాపానికి గురై నిండు ప్రాణాన్ని తీసుకుంది. ఈ విషాదం విశాఖలోని గాజువాక శ్రీనగర్‌ సుందరయ్యకాలనీలో చోటు చేసుకుంది. అందరికీ ఈరోజే చెల్లిస్తున్నట్లు మొబైల్ ద్వారా మెసేజ్ పంపి ఈ ఆత్మహత్య చేసుకుంది.

గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండవ వెంకటసత్యనారాయణ, ఉషామణి దంపతుల పెద్ద కుమార్తె మండవ ఆహ్లాద(22) ఎంబీఏ చదివింది. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా లోన్ వస్తుందని తెలిసి.. నలుగైదు యాప్‌ల ద్వారా 25వేలలోపు రుణాలను ఆహ్లాద తీసుకుంది. ఒకరి వద్ద చేసిన అప్పును తీర్చేందుకు మరొకరి యాప్ ద్వారా పొందింది. అయితే, తిరిగి చెల్లించాల్సింది ఒత్తిడి పెరగడంతో ఆహ్లాద తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. స్నానానికి వెళ్తానని చెప్పి బెడ్రూమ్ లో తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ డాటా అధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కుటుంబ అవసరాల కోసం ఒకరిద్దరి వద్ద రూ.5వేలు, 3వేలు అప్పు చేసినట్లు మాత్రమే తనకు తెలుసని.. ఎవరెవరో రీపేమెంటు కోసం మెసేజ్‌లు పెడుతుంటే తన కుమార్తె రెండు రోజులుగా ఆందోళనగా ఉన్నదని తల్లి పోలీసులకు వివరించింది.