Electric Scooter: మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీ బాయ్స్‌కి మాత్రం నంబర్ ‘వన్’ ఆప్షన్..
నోయిడాకు చెందిన వన్ ఎలక్ట్రిక్ కంపెనీలో తమ రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. క్రిడ్న్ ఎక్స్ఆర్( Kridn XR) పేరుతో విడుదలైన స్కూటర్ పూర్తిగా మన దేశంలోనే డిజైన్ చేసి, ఉత్పత్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
![Electric Scooter: మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీ బాయ్స్‌కి మాత్రం నంబర్ ‘వన్’ ఆప్షన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/04/kridn-xr.jpg?w=1280)
విద్యుత్ శ్రేణి వాహనాల తయారీలో మన దేశంలోని కంపెనీలు కూడా పోటీపడుతున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడే విధంగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో నోయిడాకు చెందిన వన్ ఎలక్ట్రిక్ కంపెనీలో తమ రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. క్రిడ్న్ ఎక్స్ఆర్( Kridn XR) పేరుతో విడుదలైన స్కూటర్ పూర్తిగా మన దేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది పూర్తిగా డెలీవరీ ఉద్యోగాలు చేసే వారిని ఉద్దేశించి తయారు చేసినట్లు వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పర్ఫెక్ట్ డెలివరీ వెహికల్..
ఈ సందర్భంగా వన్ ఎలక్ట్రిక్ సీఈఓ మాట్లాడుతూ ‘పర్ఫెక్ట్ డెలివరీ వెహికల్’ ను లాంచ్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఈ క్రిడ్న్ ఎక్స్ ఆర్ ఇది స్కూటర్, మోటార్ సైకిల్ కి మధ్యస్తంగా ఉంటుందన్నారు. చాలా డెలివరీ వాహనాలను అధ్యయనం చేసి, వస్తువులను మోసుకెళ్లి, సులభంగా చివరి గమ్యస్థానాన్ని చేర్చేందుకు ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దామన్నారు. ఇది రోజంతా డెలివరీల కోసం కష్టపడే వారికి బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. దీనిలో పెద్ద చక్రాలు, లోడ్ పెట్టడానికి ఉపయుక్తంగా ఉండేలా పెద్ద సీటు, కాలి దగ్గర కూడా వస్తువులు పెట్టుకోడానికి స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. డ్రైవ్ చేసే వ్యక్తికి సౌక్యంతో పాటు అధిక భద్రతను ఇచ్చేలా దీనిని డిజైన్ చేశామన్నారు.
సామర్థ్యం ఇలా..
అలాగే వన్ ఎలక్ట్రిక్ సీఓఓ అభిజిత్ షా సామర్థ్యం, ఫీచర్ల గురించి మాట్లాడుతూ ఈ స్కూటర్ లో హెవీ డ్యూటీ ఛాసిస్ ఉంటుందన్నారు. గంటకు 55 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణించగలుతుందని చెప్పారు. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ప్రకటించారు. ఐదేళ్ల వారంటీ కూడా ఈ బైక్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాటరీ కూడా మార్చుకోదగినది ఇచ్చినట్లు పేర్కొన్నారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/tvs-iqube-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/honda-activa-electric.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/gogoro-2-series.jpg)
మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..
క్రిడ్న్ ఎక్స్ ఆర్ స్కూటర్ వచ్చే జూన్ నెల నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వివిధ డెలివరీ కంపెనీల ప్రతినిధులతో డెమో చేయించి.. జూలై నుంచి డెలివరీలు ప్రారంభించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. మన దేశంతో పాటు ఆఫ్రికా, యూరోప్, సౌత్ ఈస్ట్ ఆసియా వంటి చోట్ల కూడా దీనిని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..