విజయవాడలో హవాలా రాకెట్ కలకలం, రూ.కోటి స్వాధీనం, వాట్సాప్ గ్రూప్ ద్వారా లావాదేవీలు
విజయవాడలో హవాలా దందా కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న చీకటి కోణాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.
విజయవాడలో హవాలా దందా కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న చీకటి కోణాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను కృష్ణలంక పీఎస్ పరిధిలో ఆదివారం అరెస్టు చేశారు. ఈ నగదును విజయవాడ నుంచి గుంతకల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వాట్సాప్ గ్రూపు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగం అంతా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ముందుగా ముఠా సభ్యులంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూపులో సభ్యులవుతారు. ఆపై డబ్బును ఒక చోటకు చేరుస్తారు. ఆ తర్వాత ఎవరికి, ఎలా ఇవ్వాలో మెయిన్ సూత్రధారి డిసైడ్ చేస్తాడు. డబ్బును ఎవరు తీసుకుంటారో.. వారికి ఒక రూ.10 నోటు ఇస్తారు. దీనికి ముందు ఆ నోటు ఫొటో తీసి హవాలా సభ్యుడికి సెండ్ చేస్తారు. రూ.10 నోటు తీసుకున్న వ్యక్తి తనకు కావాల్సిన ప్రాంతానికి వెళ్లి, అక్కడున్న హవాలా సభ్యుడికి ఆ నోటు ఇస్తారు. నోటు మీద ఉన్న సీరియల్ నెంబరే నగదు లావాదేవీల కోడ్‌గా వారు భావిస్తారు. కోడ్ సరిపోలితే నోటు తెచ్చిన వ్యక్తికి హవాలా నగదు ఇచ్చేస్తారు. ఇలా రూ.10 నోటే హవాలా రాకెట్‌లో కీ రోల్ పోషిస్తోస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో జరుగుతున్న నగదు రవాణాపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదు మొత్తం ఎక్కడిది? ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరికి ఇస్తున్నారు? తదితర విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !
Ind vs Aus : రెండో వన్డేలో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు