రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరుతో ఫోన్ కాల్స్.. నూతన్ నయా మోసం
పోలీసులు అరెస్టు చేసిన రోజే.. నెట్‌కాల్ నుంచి తన భార్యకు నూతన్‌నాయుడు ఫోన్‌కాల్స్ చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత డాక్టర్ సుజాత, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వాసుధేవ్‌కు నూతన్‌నాయుడు పీవీ రమేష్ పేర్లతో ఫోన్లు చేశాడు. వరుసగా వారికి ఫోన్లు చేసి పెందుర్తి నుంచి కొందరు వస్తారని..

Nutan Naidu fake phone calls : విశాఖ పెందుర్తిలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం వ్యవహారంలో అతని పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. కర్నాటకలోని ఉడిపిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి పారిపోతుండగా గుర్తించి అరెస్టు చేసినట్టు విశాఖ పోలీసులు తెలిపారు.
ఆగస్టు 24న పెందుర్తిలో ఈ ఘటన జరగ్గా.. 24గంటల్లో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన రోజే.. నెట్‌కాల్ నుంచి తన భార్యకు నూతన్‌నాయుడు ఫోన్‌కాల్స్ చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత డాక్టర్ సుజాత, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వాసుధేవ్‌కు నూతన్‌నాయుడు పీవీ రమేష్ పేర్లతో ఫోన్లు చేశాడు. వరుసగా వారికి ఫోన్లు చేసి పెందుర్తి నుంచి కొందరు వస్తారని.. చూసుకోవాలని సమాచారం ఇస్తాడు. అదే టైంలో డాక్టర్ సుధాకర్‌కు పీవీ రమేష్ పేరుతో ఫోన్ కాల్ రావడంపై ఆయనకు అనుమానం వచ్చింది. దాంతో వచ్చిన కాల్ సరైందో కాదో తెలుసుకునేందుకు పీవీ రమేష్‌కు ఫోన్ చేయగా.. తాను చేయలేదని సదరు అధికారి సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.
దాంతో పోలీసులు ఆ నెంబర్‌పై నజర్ పెట్టగా.. అది నూతన్‌నాయుడు చేస్తున్నట్టుగా అనుమానించారు. ఆ నెంబర్ కాల్‌డేటాపై నిఘా పెట్టగా ఉడిపిలో ఉన్నట్టు గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో అరెస్టు చేశామన్నారు విశాఖపట్నం సీపీ మనీష్‌కుమార్ సిన్హా.
అయితే నూతన్‌నాయుడు తన పేరును పీవీ రమేష్‌గా చెప్పడంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అతని పేరు ట్రూ కాలర్‌లో ఏపీ చీఫ్ సెక్రెటరీ ఏపీ సీఎంవో అని రావడాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ పేరుతో ఇంకా ఏమైనా మోసం చేశాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా సీఎంవో పీఎస్‌గా చెప్పుకోవడంపై పోలీసులు కూడా ఖంగుతిన్నారు.




