పీవోకేనే మా టార్గెట్: హుంకరించిన రాజ్‌నాథ్
పాకిస్తాన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదం వీడే వరకు పాక్‌తో చర్చలు ఉండవని ఆయన స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌తో పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)లో మాత్రమే భారత్ మాట్లాడుతుంది’’ అని ఆయన అన్నారు. హర్యానాలో జరిగిన జాన్ ఆశీర్వాద్ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు అయ్యింది. జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి మొదలైంది. కానీ మన పక్క దేశం మాత్రం భారత్ తప్పు చేసిందంటూ […]

పాకిస్తాన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదం వీడే వరకు పాక్‌తో చర్చలు ఉండవని ఆయన స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌తో పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)లో మాత్రమే భారత్ మాట్లాడుతుంది’’ అని ఆయన అన్నారు. హర్యానాలో జరిగిన జాన్ ఆశీర్వాద్ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్ 370 రద్దు అయ్యింది. జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి మొదలైంది. కానీ మన పక్క దేశం మాత్రం భారత్ తప్పు చేసిందంటూ మిగిలిన దేశాల తలుపులు తట్టుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ ఎప్పుడైతే ఆపుతుందో అప్పుడే ఆ దేశంతో మాట్లాడుతాం. ఇప్పుడు పాక్‌తో మాటలంటే.. అది పీవోకేలో మాత్రమే. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బాలాకోట్ కంటే పెద్ద దాడిని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. అంటే ఆయనకు బాలాకోట్ దాడి ఎంత పెద్దదో ఇప్పుడు తెలిసిందనుకుంటా అని అన్నారు. కాగా ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్‌తో కయ్యానికి సిద్ధమంటూ పాక్ అధికారులు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈ విషయంలో మిగిలిన దేశాల సహాయం తీసుకొని అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. అందులో తలదూర్చబోమని చాలా దేశాలు పాక్‌కు బాహటంగానే ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే.



