హరికృష్ణకు చంద్రబాబు నివాళి

దివంగత మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ తొలి వర్థంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరికృష్ణ నివాసంలో.. చంద్రబాబును కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు సాదరంగా ఆహ్వానించారు. ఆత్మీయంగా వారిని దగ్గరకు తీసుకుని పరామర్శించారు చంద్రబాబు. కుటుంబానికి సంబంధించి పలు విషయాలను వారితో చర్చించినట్టు సమాచారం. కాగా.. గతేడాది ఇదే సమయంలో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:00 pm, Sun, 18 August 19
హరికృష్ణకు చంద్రబాబు నివాళి

దివంగత మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ తొలి వర్థంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరికృష్ణ నివాసంలో.. చంద్రబాబును కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు సాదరంగా ఆహ్వానించారు. ఆత్మీయంగా వారిని దగ్గరకు తీసుకుని పరామర్శించారు చంద్రబాబు. కుటుంబానికి సంబంధించి పలు విషయాలను వారితో చర్చించినట్టు సమాచారం. కాగా.. గతేడాది ఇదే సమయంలో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే.

Nandamuri Harikrishna 1st Year Death Anniversary