AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రేపిస్టు ఇంకా మీతోనే.. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే.. కుల్దీప్ సింగ్ సెంగార్ ని ఇంకా మీ పార్టీ వదలలేదంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. బీజేపీని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్థానిక డైలీలో ప్రచురితమైన ఓ యాడ్ లో ఇతర బీజేపీ నేతలతో బాటు సెంగార్ ఫోటో కూడా ఉండడాన్ని ఆమె ప్రశ్నించారు. ఉన్నావ్ కేసులో సుప్రీంకోర్టు మిమ్మల్ని (బీజేపీని) తప్పు పట్టిందని, అలాగే సీబీఐ కూడా తన రిపోర్టులో […]

ఆ రేపిస్టు ఇంకా మీతోనే.. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 18, 2019 | 4:18 PM

Share

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే.. కుల్దీప్ సింగ్ సెంగార్ ని ఇంకా మీ పార్టీ వదలలేదంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. బీజేపీని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్థానిక డైలీలో ప్రచురితమైన ఓ యాడ్ లో ఇతర బీజేపీ నేతలతో బాటు సెంగార్ ఫోటో కూడా ఉండడాన్ని ఆమె ప్రశ్నించారు. ఉన్నావ్ కేసులో సుప్రీంకోర్టు మిమ్మల్ని (బీజేపీని) తప్పు పట్టిందని, అలాగే సీబీఐ కూడా తన రిపోర్టులో ఈ రేప్ ఉదంతాన్ని , సెంగార్ నిర్వాకాన్ని పేర్కొందని, అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరింకా ‘ వేలాడుతున్నారని ‘ ప్రియాంక గాంధీ కమలనాథులపై ఫైరయ్యారు. ఈ యాడ్ లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలతో బాటు.. స్థానిక పార్టీ నేతల ‘ ముఖార విందాలు ‘ ఉన్నాయి. అయితే దీనిపై యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ని సంప్రదించగా.. సెంగార్ తమ ప్రాంత ఎమ్మెల్యే అని, అందుకే అతని ఫోటో చేర్చారని అన్నారు. సెంగార్ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆ ఫోటో ఉంటుందన్నారు. ఏది ఏమైనా ఈ యాడ్ కమలం పార్టీకి ఇరకాట పరిస్థితిని సృష్టించింది. పైగా హర్దోయ్ నియోజకవర్గ బీజేపీ శాసన సభ్యుడు ఆశిష్ సింగ్ ఆషు… సెంగార్ పట్ల సానుభూతి చూపుతూ .. అతడు తన కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతాడో అని తామంతా చూస్తున్నామని వ్యాఖ్యానించి.. పార్టీని మరింత ‘ భ్రష్టు ‘ పట్టించాడు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు