షాకింగ్ : భీమవరంలో బ్యాంకులకు బురిడీ.. వందల కోట్ల కుంభకోణం
దొంగతనం చేసి నగదు దోచుకునే వారు కొందరు.. దర్జాగా దోచుకునేవారు మరికొందరు. అయితే సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతూ కొంతమంది వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలుగుచూసింది. కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి ప్రైవేటు బ్యాంకులను బురిడీ కొట్టించారు. వీరు సమర్పించిన నకిలీ పత్రాలతో ఏకంగా రూ.370 కోట్లు దోచుకున్నట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో రుణం తీసుకుని నెలలు గడుస్తున్నా బ్యాంకుకు చిల్లిగవ్వ కూడా […]

దొంగతనం చేసి నగదు దోచుకునే వారు కొందరు.. దర్జాగా దోచుకునేవారు మరికొందరు. అయితే సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతూ కొంతమంది వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలుగుచూసింది. కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి ప్రైవేటు బ్యాంకులను బురిడీ కొట్టించారు. వీరు సమర్పించిన నకిలీ పత్రాలతో ఏకంగా రూ.370 కోట్లు దోచుకున్నట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో రుణం తీసుకుని నెలలు గడుస్తున్నా బ్యాంకుకు చిల్లిగవ్వ కూడా కట్టకుండా తిరుగుతున్నట్టుగా సమాచారం.
అయితే తీసుకున్న మొత్తాన్ని ఇవ్వకుండ ఎగ్గేట్టేందుకు వీరు ప్లాన్ చేసారని ప్రైవేటు బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ భారీ కుంభకోణంలో భీమవరానికి చెందిన ప్రముఖులు చాలమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో వీరు దర్జాగా తిరుగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.