నాకూ, వల్లభనేని వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్..

వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతల  మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈ తతంగంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపించడం రివాజుగా మారింది. ఈ సందర్భంగా మరోసారి ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ లోకేష్, చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ తనకు చేసింది ఏమి లేదని.. తనకు, వల్లభనేని వంశీకి కూడా రాజకీయ […]

నాకూ, వల్లభనేని వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్..
Ravi Kiran

| Edited By: Srinu Perla

Nov 22, 2019 | 12:09 PM

వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతల  మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈ తతంగంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపించడం రివాజుగా మారింది. ఈ సందర్భంగా మరోసారి ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ లోకేష్, చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.

టీడీపీ తనకు చేసింది ఏమి లేదని.. తనకు, వల్లభనేని వంశీకి కూడా రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అని కొడాలి నాని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణమని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా లోకేష్ లాంటి దద్దమ్మ వల్లే టీడీపీ నాశనం అవుతోందని కొడాలి నాని ధ్వజమెత్తారు.

అటు సెల్ఫ్ డిక్లరేషన్ అంశంపై కూడా స్పందించిన నాని.. తన పేరులోనే వెంకటేశ్వర అని ఉందని .. శ్రీవారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కేవలం తాను అన్నది చంద్రబాబును అని.. ఇక ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు.. అంతేకాకుండా ముగించిన తర్వాత కూడా జగన్ తిరుపతి వెళ్లారని.. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని కొడాలి నాని గుర్తు చేశారు. అటు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఎన్నోమార్లు పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. ఇలా అనేక సార్లు వైఎస్ కుటుంబం తిరుపతి గుడికి వెళ్లి.. వస్తుండటం ఆనవాయితీగా జరుగుతోంది. అప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ అంశం.. ఇప్పుడెందుకు వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ కావాలనే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu