జబర్దస్త్ వదిలేయడానికి కారణం ఇదే..!
వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. ఇక ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీమ్ లీడర్లతో పాటుగా ఈ షోలకు విపరీతమైన క్రేజ్ రావడంలో న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించిన నాగబాబు కీలక […]
వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. ఇక ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీమ్ లీడర్లతో పాటుగా ఈ షోలకు విపరీతమైన క్రేజ్ రావడంలో న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించిన నాగబాబు కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆయన ‘జబర్దస్త్’ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్‌తో పాటుగా నెట్టింట్లో కూడా ఈ విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న తరుణంలో నాగబాబు స్వయంగా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
2013 ఫిబ్రవరి నుంచి 2019 ఈరోజు వరకు జబర్దస్త్‌తో తనకు ఎమోషనల్, హ్యాపీ జర్నీ కొనసాగిందని నాగబాబు అన్నారు. తాను జబర్దస్త్ మానేయడానికి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అందుకనే స్వయంగా దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకు వచ్చానన్నారు. జబర్దస్త్ గురించి తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడింది లేదని.. ఎల్లప్పుడూ ఈ షోకు పూర్తి సపోర్ట్‌నే అందించానని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇలా ఆయన షో నుంచి వైదొలగడానికి గల కారణాల గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..